Breaking News

వెలుగుల పండుగ వెనుక ఇంత ఆరోగ్య రహస్యం ఉందా..?!

Published on Thu, 11/05/2026 - 16:50

మన పూర్వీకులు ఏర్పరచిన పండుగ ఆచారాల్లో ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. దీపావళికి ముందు ఇళ్లను శుభ్రం చేసుకోవడం, నూనెతో తలంటుకొని స్నానం చేయడం, దీపాలు వెలిగించడం మన సంప్రదాయంలో భాగమయ్యాయి. వీటిలోని ఆచారపరమైన, సాంస్కృతికమైన ప్రాధాన్యాన్ని తెలుసుకోవడంతోపాటు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా వివేచనతో పరిశీలించాలి.

నరకచతుర్దశి నాటి స్నానం
నరకచతుర్దశి నాడు నువ్వుల నూనెతో ఒంటికి మర్దన చేసుకొని అభ్యంగన స్నానం చేయడం మన సంప్రదాయం. నువ్వుల నూనెను ఆయుర్వేద సంప్రదాయంలోనూ ఉపయోగిస్తారు. నూనెతో మర్దన చేయడం కొందరికి విశ్రాంతిని, హాయిని కలిగించవచ్చు. అభ్యంగన స్నానం పండుగకు సంబంధించిన పవిత్ర ఆచారంగా భావించబడుతుంది. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన దుస్తులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగాలు.

దీపాల వెలుగు – శుభానికి ప్రతీక
దీపావళి నాడు ఇంటి ముందు, తులసికోట వద్ద, దేవాలయంలో దీపాలు వెలిగించడం మన సంప్రదాయంలో విశిష్టమైన ఆచారం. దీపపు వెలుగు చీకటిని తొలగించి పరిసరాలకు అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం కూడా మన సంప్రదాయంలో భాగం.

దీపం జ్ఞానజ్యోతికి ప్రతీక. దీపం చీకటిలో ఉన్న వస్తువులను  స్పష్టంగా కనిపించేలా చేసినట్లే, జ్ఞానం మన జీవితంలోని అజ్ఞానాన్ని తొలగించి సరైన మార్గాన్ని చూపుతుంది. దీపం వెలిగించేటప్పుడు మనలోని దుర్గుణాలను తొలగించుకొని, సద్గుణాలను పెంపొందించుకోవాలని సంకల్పించాలి.

ఇంటి ముందు దీపాలు వెలిగించడం ద్వారా పరిసరాలకు పండుగ శోభను తీసుకురావడంతోపాటు వెలుగును అందరితో పంచుకోవాలనే సత్సంకల్పాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. మన పండుగలలోని అంతరార్థం ఏమిటంటే, మనిషి తన మనోవికాసానికి ప్రయత్నిస్తూనే దేశ సౌభాగ్యానికి కూడా తోడ్పడాలి. ఒకరికొకరం అనే భావనతో నలుగురితో కలిసి వేడుకను జరుపుకోవడమే నిజమైన పండుగ.

టపాకాయలు – ఆరోగ్య జాగ్రత్తలు
దీపావళి అనగానే చాలామందికి టపాకాయలు గుర్తుకొస్తాయి. పండుగల సందర్భంగా శబ్దాలు చేయడం, వెలుగులు విరజిమ్మడం ఆనందోత్సాహాలకు ప్రతీకలుగా మారాయి. అయితే ట΄ాకాయలు కాల్చడం వల్ల వాతావరణంలోని క్రిమికీటకాలు నశించి, రోగాలు నివారించబడతాయని నిర్ధారిత ఆధారాలు లేవు. టపాకాయల పొగ వాయు కాలుష్యానికి దారి తీయవచ్చు. 

అధిక శబ్దం శబ్దకాలుష్యాన్ని పెంచవచ్చు. అందువల్ల పండుగను జరుపుకునేటప్పుడు ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూ, టపాకాయల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చు.

మనస్సును శుద్ధి చేయడమే నిజమైన సంపద 
మనిషికి బాహ్య సంపదల తోపాటు అంతరంగ సంపదలు కూడా అవసరం. ప్రేమ, కరుణ, దయ, క్షమ, సత్యనిష్ఠ, సేవాభావం, సంతృప్తి వంటి గుణాలు జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి.

మన ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించినా, మన మనస్సులో ద్వేషం అనే చీకటి ఉంటే ఆ వెలుగుకు సంపూర్ణ సార్థకత ఉండదు. బంగారు ఆభరణాలు ఎన్ని ధరించినా మన ప్రవర్తనలో వినయం లేక΄ోతే నిజమైన సౌందర్యం కనిపించదు. అపారమైన ధనం ఉన్నా పక్కవారి కష్టాన్ని చూసి స్పందించలేక΄ోతే మన సంపదకు మానవీయ పరిపూర్ణత ఉండదు. ఇతరులకు హాని కలిగించకుండా జీవించడం, నిజాయితీగా సంపాదించడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం, ప్రకతిని పరిరక్షించడం ఉన్నతమైన జీవన విలువలు. పండుగను జరుపుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా మన ధర్మమే.

టపాకాయల వల్ల కలిగే అధిక శబ్దం వృద్ధులకు, చిన్నపిల్లలకు, అనారోగ్యంతో బాధపడేవారికి, జంతువులకు ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల శబ్దకాలుష్యాన్ని తగ్గిస్తూ, పర్యావరణానికి హాని కలగకుండా దీపావళిని జరుపుకోవాలి. మన ఆనందం ఇతరుల ఆవేదనకు కారణం కాకూడదు. వెలుగుల పండుగ అందరి జీవితాల్లోనూ ఆనందాన్ని నింపాలి.
– టి.వి.యల్‌. గాయత్రి

నిర్వహణ: డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

ఇదీ చదవండి: ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ!

#

Tags : 1

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)