Breaking News

82 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా అమితాబ్‌..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..

Published on Wed, 08/20/2025 - 10:13

‘వయసు పైబడడం అనేది సహజం... వచ్చే సమస్యలు కూడా సహజం’ అని ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేవారు కొందరు. ‘వయసు పైబడడం అనేది సహజమే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం తప్పనిసరి’ అని ముందుకు వెళ్లేవారు కొందరు. బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ రెండో కోవకు చెందిన వ్యక్తి.

తన ఆలోచనలను పర్సనల్‌ బ్లాగ్‌ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు బిగ్‌ బి. 82 సంవత్సరాల అమితాబ్‌ తాజాగా వృద్ధాప్యానికి సంబంధించిన సవాళ్ల గురించి తన తాజా పోస్ట్‌లో రాశారు. ఇంట్లో ‘హ్యాండిల్‌ బార్స్‌’ అవసరం గురించి ప్రస్తావించారు.

వృద్ధుల కోసం బాత్‌రూమ్‌లో, ఇంట్లోని కొన్ని చోట్ల హ్యాండిల్‌ బార్స్‌ లేదా గ్రాబ్‌ బార్స్‌ ఏర్పాటు చేస్తారు.

‘మీట్‌–అండ్‌–గ్రీట్‌ విత్‌ ఫ్యాన్స్‌’లో భాగంగా అభిమానులను కలుసుకున్న తరువాత తన దినచర్య గురించి రాశారు బిగ్‌ బి.

‘శరీరం క్రమేణా సమతుల్యత కోల్పోతోంది’ అని రాసిన బచ్చన్‌ తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. యోగా, శ్వాస వ్యాయామాలు, మొబిలిటీ వ్యాయామాల ప్రాముఖ్యత గురించి తన పోస్ట్‌లో నొక్కి చెప్పారు.

‘82 సంవత్సరాల వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అనే ప్రశ్నకు సోషల్‌ మీడియాలో ఆయన పోస్ట్‌లే సమాధానం చెబుతాయి. సందర్భానుసారంగా ఉన్నత జీవనశైలికి సంబంధించిన అలవాట్ల గుంచి ఎన్నో పోస్ట్‌లలో వివరించారు అమితాబ్‌.

ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్న సూపర్‌ స్టార్‌ నిజమైన పోరాట యోధుడు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి. 

(చదవండి: 'బ్యూటిఫుల్‌ బామ్మ'..! ఫిట్‌నెస్‌లో సరిలేరు ఈమెకెవ్వరూ..)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)