క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
ఆ వ్యాయామ మెషీన్‌తో 113 కిలోల నుంచి 90కిలోలు..!
Published on Mon, 03/30/2026 - 11:09
కొందరికి బరువు తగ్గడం అంత సులభం కాదు. తగ్గినట్టు తగ్గి అమాంతం యథావిధిగా బరువు పెరిగిపోతుంటారు. సర్జరీలు వంటివి కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. శరీరాన్ని కష్టపెట్టడానికి, చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనురించడంలో విఫలమయ్యే వారి పరిస్థితి వెయిట్‌లాస్ విషయంలో దాదాపు ఇలానే ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ 68 ఏళ్ల అమెరికన్ వ్యక్తి. అతడి కథ వింటే..ఆరోగ్యం విషయంలో ఎలా ఉండకూడదో కనువిప్పు కలుగుతుంది.
అమెరికాకు చెందిన అల్ ఎస్పోసిటో 46 ఏళ్ల వయసులో సుమారు 226 కిలోల బరువు ఉండేవాడు. తన రూపాన్ని చూసి ఆయనే ఇబ్బంది పడేవాడు. తగ్గాలని స్వల్పకాలిక ప్రయోజనాలిచ్చే డైట్‌లు ప్రయత్నిస్తుండేవాడు. అవేమి వర్కౌట్ అవ్వకపోయేసరికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీని ఎంచుకున్నారు. ఆ శస్త్రచికిత్సకు ముందే పలువురు కోల్పోయిన బరువులో 20% మళ్లీ పెరుగుతావని చెప్పారు కూడా.
అలాగే అల్ ఎస్పోసిటో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత సుమారు 91 కిలోలు తగ్గాడు. అయితే మళ్లీ ఇదివరకు చెడు ఆహారపు అలవాట్లతో మళ్లీ బరువు పెరిగిపోయాడు. కనీసం వ్యాయమం చేసేందుకు ప్రయత్నించకపోవడంతో సుమారు 154 కిలోలకు వచ్చేశాడు. అధిక బరువు కారణంగా కుడి మోకాలిలో తీవ్రమైన నొప్పి మొదలైంది. వైద్యులు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స సిఫార్సు చేశారు.
అయితే ఆపరేషన్‌కు అతడి శరీరం సహకరించలేదు. దాంతో అల్ బరువు తగ్గక తప్పలేదు. ఆ నేపథ్యంలో మెడిటేరియన్ డైట్‌ని అనుసరించి రోజుల తరబడి వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులను జీవితంలో చేర్చుకున్నాడు. అలా అల్ సుమారు 129 కిలోలకు చేరుకున్నాడు. ఆ తర్వాత కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. చివరగా, ఫిబ్రవరి 2025లో ఫిజికల్ థెరపీ పూర్తి చేసుకున్న తర్వాత, అతను తన బరువు తగ్గే ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు.
అయితే బరువు తగ్గడంలో రోయింగ్ మెషీన్ బాగా హెల్ప్ అవుతుందని సన్నిహితులు సూచించడంతో ఆ మెషీన్‌ని కొని తెచ్చుకుని వర్కౌట్‌లు చేయడం ప్రారంభించాడు. రోయింగ్ మెషీన్‌పై వర్కౌట్లు చేసేటప్పటకీ అతడి బరువు 113 కిలోలు. ఇవాళ అనూహ్యంగా 90 కిలోల బరువు తగ్గడం విశేషం.
మొదట్లో 20 నిమిషాల కంటే తక్కువ నిడివిగల చిన్న సెషన్లతో ప్రారంభించి క్రమంగా క్రమంగా ఎక్కువ సేపు చేసే వర్కౌట్‌లకు పెంచుకుంటూ, చివరికి రోజుకు 90 నిమిషాల వరకు రోయింగ్ చేశాడు. అంతేగాదు స్థిరమైన భోజన సమయాలను పాటిస్తూ..రాత్రి ఎనిమిది తర్వాత ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అలాగే చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ ఫుడ్ విషయంలో మంచి కేర్ తీసుకుంటూ బరువుని అదుపులో ఉంచాడు అల్.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.
(చదవండి: సద్గురు పేరెంటింగ్ సలహా..! నటి అలియా భట్ రియాక్షన్..)
Tags : 1