Breaking News

హెల్త్‌: నిద్రలేమి సమస్యా? అయితే ఇలా చేయండి!

Published on Sat, 03/30/2024 - 09:13

ఆరోగ్యంగా ఉండటానికి సరైన తిండి, శరీరానికి తగిన వ్యాయామాలతో పాటు కంటినిండా నిద్ర కూడా అంతే అవసరం. అయితే కొంతమంది జీవన శైలి, మానసిక ఒత్తిడి కారణంగా సరిగా నిద్రపోవడం లేదు. అటువంటి వారు నిద్రమాత్రలకు బదులు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చు.

అరటి పండు..
నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే సమయంలో అరటిపండును తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే గుణాలు శరీరంలోని ఒత్తిడిని సులభంగా తగ్గించి నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈరోజు అరటి పండ్లతోపాటు చెర్రీలను కూడా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొంతమంది తరచుగా నిద్ర పోయినట్లే పోయి మేల్కొంటారు. అయితే ఇలాంటివారు చెర్రీస్‌తో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

నిద్రను మెరుగుపరిచేందుకు పైనాపిల్‌ జ్యూస్‌ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి నిద్రలేని సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాలి. పైనాపిల్‌లో మెలటోనిన్, విటమిన్‌ సి, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు దీనితో జ్యూస్‌ని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

కివీ పండ్లు..
ద్ర సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు కూడా నిద్ర స్థాయులను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.

యాపిల్‌..
యాపిల్‌ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ యాపిల్‌ తింటే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి పూట తినడానికి యాపిల్‌ అనేది బెస్ట్‌ స్నాక్‌గా చెపొ్పచ్చు. రాత్రి ఆకలి వేస్తే ఎలాంటి సందేహం లేకుండా యాపిల్‌ తినండి. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. నిద్ర అనేది బాగా పడుతుంది.

బొప్పాయి..
బొప్పాయిలో విటమిన్‌ సి, ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు హాయిగా నిద్ర పోయేలా చేస్తాయి. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట బొప్పాయి తింటే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి చదవండి: Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)