Breaking News

హెల్త్‌: మెడనొప్పికి అసలు కారణాలేంటో తెలుసా!?

Published on Sat, 03/30/2024 - 09:29

సాధారణంగా టీనేజర్లలో మెడనొప్పి, నడుమునొప్పి లాంటి మధ్యవయస్కులకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంతగా కనిపించకపోవచ్చుగానీ.. అవి రాకపోవడం అంటూ ఉండదు. ఆ వయసులో వారికుండే కొన్ని రకాల లైఫ్‌స్టైల్‌ అలవాట్లూ, ఇబ్బందులే అందుకు కారణం. ఉదాహరణకు.. వారు స్కూళ్లూ/కాలేజీలలో చాలాసేపు అదేపనిగా కూర్చునే ఉండటం, సరైన పోశ్చర్‌లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్‌కూ, కుర్చీకీ మధ్య తగినంత దూరం లేకపోవడం లాంటి ఎన్నో అంశాల కారణంగా వాళ్లకూ మెడనొప్పి రావచ్చు.

అలవాట్లే కాకుండా.. ఆరోగ్య సమస్యల విషయానికొస్తే.. థైరాయిడ్‌ లోపాలు, చిన్నతనంలో వచ్చే (టైప్‌–1) డయాబెటిస్, విటమిన్‌ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వస్తుంటుంది. అలాగే, టీనేజర్లకు ఆ వయసులో కొందరికి వచ్చే స్థూలకాయం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతోనూ రావచ్చు.

టీనేజర్లలో మెడనొప్పి నివారణకు చేయాల్సినవి..
పై సమస్యల్లో ఏదైనా కారణమా అని మొదట చూసుకోవాలి. ఉదాహరణకు.. స్కూల్‌ / కాలేజీలో కూర్చునే చోట.. డెస్క్‌ తమ ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో, అందుకు తగినట్లుగా పోశ్చర్‌ ఉందో లేదో పరిశీలించుకోవాలి. కంప్యూటర్లపై పనిచేయడం లేదా వీడియో గేమ్స్‌ కోసం అదేపనిగా మెడను నిక్కించి ఉంచడం వల్ల ఆ భాగంలోని వెన్నుపూస ఎముకలూ, మెడ కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు.

పోశ్చర్‌ సరిగా లేనప్పుడు / కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాల మీద పడాల్సిన విధంగా కాకుండా.. ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్‌ టేబుల్‌ వద్ద సరిగా (సరైన పోశ్చర్‌లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు.

స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. అందువల్ల ఒబేసిటీని పెంచే జంక్‌ఫుడ్‌ /బేకరీ ఐటమ్స్‌ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి. గతంలో టీనేజీ పిల్లలు వారి వయసుకు తగ్గట్లు బాగానే ఆటలాడేవారు. కానీ ఇటీవల వారు ఆటలాడటం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత అరుదుగా ఆడే ఆటలూ పూర్తిగా కరవైపోయాయి. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం ఇటీవల పెరిగింది.

తగినంత వ్యాయామం లేని టీనేజర్లు.. తమ దేహ శ్రమతో తమ సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. వారి మెడ భాగపు కండరాలూ, అక్కడి వెన్నుపూసల సామర్థ్యం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే పిల్లలు తగినంత వ్యాయామం చేయడం / ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి.

పిల్లల్లో విటమిన్‌–డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు.. వ్యాధి నిరోధకత తగ్గి.. వయసు పెరిగే క్రమంలో డయాబెటిస్, క్యాన్సర్‌ వ్యాధుల రిస్క్‌ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలు ఆరుబయట ఆడేలా చూడాలి.

ఇవి చదవండి: హెల్త్‌: నిద్రలేమి సమస్యా? అయితే ఇలా చేయండి!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)