Breaking News

గోధుమ/జొన్న/రాగులతో రోటీలు,దోసెలు.. లాభాలేమిటి? ఏ సీజన్‌లో ఏవి తినాలి?

Published on Fri, 02/13/2026 - 23:00

పుల్కా కావచ్చు, చపాతీ కావచ్చు...ప్రస్తుతం  ప్రతి రోజూ రోటీలను తినడం చాలా మంది ఆరోగ్యార్ధులకు అలవాటుగా మారింది. నిజానికి సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్ల స్థానంలో రోటీలు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా స్థిరపడుతున్న పరిస్థితుల్లో గోధుమలతో పాటు మరికొన్ని కూడా రోటీలు, దోసెల తయారీలో వినియోగిస్తున్నారు. అలాంటి వాటిలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను కూడా చేరుస్తున్నారు. సహజ ఆహారాన్ని ప్రోత్సహించే వైద్యులు కల్పిస్తున్న అవగాహన కూడా వీటి వినియోగాన్ని పెంచుతోంది.

అయితే ఇప్పుడున్న అవగాహన ప్రకారం.. ఇవి కేవలం కేలరీలు లేదా ఫైబర్‌ గురించి మాత్రమే అనుకోకూడదు. నిజానికి శతాబ్దాల క్రితమే ఇవి మనకు ఆహారంలో భాగంగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి ముందు, వాతావరణానికి తగ్గట్టుగాస్థానికంగా  భూమి ఏమి అందించింది? అనేదానిపైనా,  శరీరానికి ఏమి అవసరమో దానిపైనా మాత్రమే ఆహారపు అలవాట్లు ఆధారపడి ఉండేవి. ఆ తర్వాత తర్వాత వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా  ఏడాది పొడవునా ఆహారం అందుబాటులోకి రావడంతో... కాలానుగుణంగా తినడం అనే అలవాటు తగ్గిపోయింది.

మరోవైపు గోధుమలు  చిరుధాన్యాలు (బజ్రా, రాగి, జొన్న, మక్కీ) వంటి తృణ ధాన్యాలు పోషకాలతో నిండి ఉంటాయి పరిశోధనల ప్రకారం ఈ ధాన్యాలు ఫైబర్, విటమిన్లు తదితర ఆరోగ్యకరమైన సమ్మేళనాలను అందిస్తాయి, ఇవి మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వీటిని వినియోగించడంలో సీజన్‌లను దృష్టిలో పెట్టుకుంటేనే సంపూర్ణ ప్రయోజనాలు సిద్ధిస్తాయని సంప్రదాయ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా ఈ ధాన్యాలను తీసుకుంటనే శరీరానికి మేలు చేస్తాయని అంటున్నారు.

మన శరీరాలు వేడి సీజన్‌లో లేదా చలి కాలంలో ఆహారాన్ని వేర్వేరుగా జీర్ణం చేసుకుంటాయని ఆయుర్వేదం సహా సంప్రదాయ వైవ్య విధానాలు చెబుతున్నాయి. వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా...ఇలా జీర్ణక్రియ మార్పు చేర్పులతో  శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం ద్వారా, వాతావరణానికి  సరిపోయే ధాన్యాలను మనం ఎంచుకోవచ్చు.

గోధుమలు...
మనం నిత్యం ఇష్టపడేవి గోధుమలతో చేసిన ఆహారం.  ఇది వెచ్చదనం జీర్ణ ప్రక్రియలను సమతుల్యం చేస్తుంది. వసంతకాలంలో లేదా శీతాకాలం ప్రారంభంలో జీర్ణక్రియ నెమ్మదించినప్పుడు, గోధుమ రోటిలు కడుపుపై భారం పడకుండా శక్తిని, ఫైబర్, బి–విటమిన్లు  సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను అందిస్తాయి, బరువు పెంచకుండా  రోజువారీ కార్యకలాపాలను కొనసాగించేలా చేస్తాయి.

సజ్జలు...
సజ్జలు ఆరోగ్యకరమైన ధాన్యరకమే కానీ దీనిది వేడెక్కించే స్వభావం  దీని అధిక పోషక సాంద్రత, ఇనుము, మెగ్నీషియం, ప్రోటీన్‌  ఫైబర్‌ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.  వెచ్చదనం  శక్తిని అందిస్తాయి కాబట్టి చల్లని వాతావరణంలోనే వీటిని వినియోగిస్తారు.

రాగులు
ప్రస్తుతం ఇడ్లీల నుంచి రోటీలు, దోసెల దాకా చేసేందుకు వాడే రాగులు (ఫింగర్‌ మిల్లెట్‌) కాల్షియం  సూక్ష్మపోషకాలతో సమృద్ధికర ఆహారం. వేడి సీజన్‌లో ఉదరంలో తేలికగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవి సీజన్లలో జీర్ణ మందగమనాన్ని నివారిస్తుంది. అనేక దక్షిణ భారత ప్రాంతాలు రాగులను వేసవిలో ప్రధాన ఆహారంగా చేయడానికి కారణం దాని చల్లబరిచే గుణమే.

జొన్నలు..
మక్కీ లేదా మొక్కజోన్న,  జొన్న (జోవర్‌) రోటీలు తక్కువ గ్లైసెమిక్‌ ప్రభావాలు చూపిస్తూ  బలమైన ఫైబర్‌ లను కలిగి ఉంటాయి. అవి బలమైన జీర్ణక్రియ, అధిక శ్రమ కలిగిన జీవనశైలులకు సరిపోతాయి, కానీ వాటిని కొవ్వులు లేదా కూరగాయలతో జాగ్రత్తగా జతచేయడం అవసరం. వేసవిలో చల్లదనాన్ని అందించే జొన్నలు.. శీతాకాలంలో కూడా ఉపయుక్తమైనవే.

సంవత్సరమంతా ఒకే ధాన్యాన్ని తినడానికి బదులుగా, రుతువులకు అనుగుణంగా ధాన్యాలను ఆరగించడం శరీరానికి మంచిదని సంప్రదాయ వైద్య విజ్ఞానం స్పష్టం చేస్తోంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)