అందుకే టీడీపీకి రాజీనామా చేశా... కడప టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
Breaking News
74 ఏళ్లలో సైకిల్..82 ఏళ్లకు బైక్, ట్రాక్టర్! వయసునే సవాలు చేస్తున్న బామ్మ..!
Published on Fri, 10/30/2026 - 13:18
విశ్రాంతి తీసుకునే వయసులో ఓ బామ్మ వయసునే దిక్కరించేలా సాహసాలు చేస్తూ అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. అంతేగాదు వయసు ఒక సంఖ్య మాత్రమే..అభిరుచి ముందు అదే మంత సమస్య కాదని నిరూపించింది ఈ సూపర్ బామ్మ.
ఆ బామ్మే హర్యానాలోని రోహ్తక్ జిల్లా సుందనా గ్రామానికి చెందిన 82 ఏళ్ల సుఖ్మా. ఆమె కొత్త విషయాలను ప్రయత్నిస్తూ..ఆనందాన్ని పొందుతోంది. 74 ఏళ్ల వయసులో ద్విచక్ర వాహనాలు నేర్చుకుంటూ ..వయసుకి ఏ మాత్రం సంబంధం లేని సాహసాలు చేస్తోంది. ఏదో మనవడు సరదాగా అన్నమాటను ఆమె సీరియస్ తీసుకుని నేర్చుకోవడం మొదలుపెట్టి..అందర్నీ ఆశ్చర్యపోయేలా బైక్‌లు, ట్రాక్టర్ నడిపేస్తోందామె.
ఒకరోజు ఆమె మనవడు మోటార్ సైకిల్ నడపడం నేర్చుకుంటున్నాడు. ఒక సందర్భంలో సరదాగా ఆమెతో బామ్మ మీరు కూడా బైక్ నడపడం నేర్చుకోండి అని అన్నాడు. సరదాగా అన్న ఆ మనవడి మాట ఆమెలో తెలియకుండానే ఆసక్తిని రేకెత్తించి మోటార్‌సైకిల్‌ని నడిపేందుకు దారితీసింది. అలా మనవడితో కలిసే బైక్ నడపడం నేర్చుకుంది. క్రమంగా బ్యాలెన్స్ చేయడం, యాక్సిలరేటర్ ఇవ్వడం, బ్రేకులు వేయడం అన్ని నేర్చుకుంది.
అలా నిరంతర సాధనతో ఎవరి సహాయం లేకుండానే స్వయంగా బైక్ నడిపేంత ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది. అలా అని అక్కడితో ఆగిపోలేదు ఈ బామ్మ సఖ్మా. ట్రాక్టర్‌లు నడపడంపై ఫోకస్ పెట్టి సవాలుగా తీసుకుని మరి నేర్చుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అంతేగాదు అంతా ఈ బామ్మను అత్యంత కూల్ బామ్మ అని, వయసు కేవలం అంకె మాత్రమే అని భలే నిరూపించింది అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. కాగా ఈ బామ్మ మాత్రం తనకు ఈ వయసులో బైక్‌లు నడపడమా అన్నా భయం కలగలేదని అంటోంది.
కొత్త అనుభవాల్లో దాగున్న ఆనందం ఏంటో తెలుసుకున్నానని అంటోంది ఈ బామ్మ. ఏదైనా నేర్చుకోవడానికి వయసు ఎప్పుడు అడ్డంకి కాదని సవాలుగా తీసుకుంటే..అద్భుతాలు చేయొచ్చని అంటోందామె. అలాగే వయసు పైబడటం అంటే కొత్త అనుభవాలను వదులుకోవడం కాదు అని అంటోంది. కొన్నిసార్లు కొత్త సాహసం..చిన్న జోక్‌తో మొదలవుతుందని సుఖ్మా ఉదంత తెలుపుతోంది కదూ..!.
ఇదీ చదవండి: సొంతూరిలో పల్లెటూరి పిల్లలా..ఫ్యాషన్ వేదికపై మోడల్స్‌గా మెరుపుల్..!
Tags : 1