Breaking News

పేరు మార్చేసుకున్న ఇండిగో?!

Published on Sat, 12/06/2025 - 10:09

దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది కూడా. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్‌గా ఒరిజినల్ పేమెంట్ మోడ్‌కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈతరుణంలో నెట్టింట పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా హాస్యస్పదంగా చేసిన పోస్ట్‌ హాట్‌టాపిక్‌ మారింది.

ఆ పోస్ట్‌లో వరసగా నాలుగో రోజున కూడా విమాన సర్వీసులు అంతరాయం కొనసాగుతుండగా, గోయెంకా ఎయిర్‌లైన్‌ లోగోతో కూడిన సరికొత్త పేరును నెటిజన్లతో ఇలా పంచుకున్నారు. కొనసాగతున్న విమాన సర్వీసులు అంతరాయం నేపథ్యంలో తమ ఎయర్‌లైన్స్‌ పేరు మార్పు అంటూ.. “ఇట్ డిడ్న్'ట్ గో”, అని సరదాగా ఇలా పోస్ట్‌ చేశారు. అంతే నిమిషాల్లో ఈ పోస్ట్‌వైరల్‌ అయిపోయింది. చాలామంది ప్రయాణికులు ఈ జోక్‌ను మన నిరాశను ప్రతిబింబిస్తుందని చెప్పడం విశేషం. 

భారతదేశంలోని అతిపెద్ద విమానాయాన సంస్థ ఈ వారం ప్రారంభం నుంచి వందలాది సేవలను రద్దు చేసింది, ఢిల్లీ, బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రధాన కేంద్రాలలో ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా ప్రత్యామ్నాయ విమానాల టిక్కెట్ల ధరల అమాంతం పెరిగేందుకు కారణమైంది. ఇక గోయెంకా చేసిన పోస్ట్‌ విమానాల రద్దుతో ఎయిర్‌పోర్ట్‌లో చిక్కకుపోయిన ప్రయాణికులను ఎంతాగానో ఆకట్టుకుంది. 

నెటిజన్లంతా "ఇండిగో ఇండిగో నుంచి ఇట్ డిడ్ డిట్ గోకు వెళ్లడం క్రేజీగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తదుపరి అప్‌డేట్‌ పేరు మార్పు కాదని ఆశిస్తునన్నాం అలాగే ఇక ఈ ఆలస్యం కొనసాగదని ఆశిస్తున్నాం అని పోస్టులు పెట్టారు. కానీ కొంతమంది విమాన చరిత్రలోనే ఇంతలా విమాన సర్వీసుల రద్దు అనేది భలే ట్విస్టింగ్‌గా ఉన్నా..బహుశా లోగో కూడా రీబ్రాండ్‌ కోరుకుంటుందేమో అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ విమాన సర్వీసులు అంతరాయం పూర్తిగే తగ్గే వరకు గోయెంకా పోస్ట్‌ వైరల్‌ అవుతూనే ఉంటుంది కాబోలు.

 

(చదవండి: ఏఐ చాట్‌బాట్‌తో జర జాగ్రత్తోయ్‌..!)
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు