Breaking News

స్లిమ్‌గా బాలీవుడ్‌ చిత్ర​ నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!

Published on Fri, 05/02/2025 - 12:21

ఇంతవరకు ఎందరో వెయిట్‌ లాస్‌ జర్నీలు ప్రేరణగా నిలిచాయి. ఒక్కోక్కరిది ఒక్కో నేపథ్యంతో బరువు తగ్గేందుకు ఉపక్రమించారు. అయితే వారంతా డైట్‌లు వర్కౌట్‌లతో బరువు తగ్గితే. ఈ బాలీవుడ్‌ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా మాత్రం మందులతోనే బరువు తగ్గానంటూ కుండబబ్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. అందరు ఆ మందులు దుష్ప్రభావాలు చూపుతాయనే దుష్ప్రచారంతో వాడేందుకు జంకుతున్నారని, అందులో వాస్తవం లేదని మరీ చెబుతున్నారు. తాను ఆ మందులు వాడుతూనే ఎలా ఆర్యోకరంగా బరువు తగ్గారో కూడా వెల్లడించారు. ఇదేంటి మందుల వద్దనే అంటారు కదా నిపుణులు అనే సందేహంతో ఆగిపోకండి అసలు కథేంటో తెలుసుకోండి మరీ..!.

బాలీవుడ్‌ నిర్మాత హన్సల్ మెహతా టెలివిజన్‌ షోలు తీస్తూ నెమ్మదిగా మంచి బ్లాక్‌బస్టర్‌ మూవీలు తీసి మంచి నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఉత్తమ చలన చిత్ర నిర్మాతగా అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఆయన డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఓ పక్క అధిక బరువుతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా. 

అయితే మెహతా బరువు తగ్గేందుకు తన ఆరోగ్య సమస్యల రీత్యా డయాబెటిస్‌ చికిత్సకు ఉపయోగించే మౌంజారో మందులను వాడానని అన్నారు. దానివల్లే బరువు తగ్గానని చెప్పారు. బరువు తగ్గాడానికి సెలబ్రిటీలు ఉపయోగిచే మౌజరోని తాను వాడానని మెహతా నిర్భయంగా చెప్పడమే గాక ఏకంగా పదికిలోలు తగ్గినట్లు తెలిపారు. 

అలాగే దీంతోపాటు సరైన జీవనశైలిని పాటించానని అన్నారు. అధిక ప్రోటీన్ భోజనం, చక్కెరను తగ్గించడం, మెడిటేరియన్‌ డైట్‌ వంటివి అనుసరించానని అన్నారు. ఆల్కహాల్‌ సేవించడం కూడా తగ్గించినట్లు తెలిపారు. సరైన జీవనశైలిని అనుసరించడం తోపాటు వర్కౌట్లు, అడదడపా ఉపవాసం, హైడ్రేటెడ్‌ ఉండేలా తగినంత నీరు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. 

దాంతో తన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి రావడమే గాక, ఇన్సులిన్ నిరోధకత తగ్గిందన్నారు. ఇప్పుడు యంగ్‌ ఏజ్‌లో వేసుకున్న పాత బట్టలు అన్ని సరిపోతున్నాయని ఆనందంగా చెప్పారు. 

ఆ మందులపై అపోహ ఎక్కువ..
ఓజెంపిక్‌, మౌంజారో వంటి జీఎల్‌పీ-1 మందులు బరువు తగ్గడానికి పేరుగాంచినవి. కొద్దిమేర బరువుత తగ్గాలనుకునేవారికి, దీర్ఘకాలిక బరువుతో సతమతమవుతున్న వారికి ఇవి మంచివే అనేది నిపుణులు అభిప్రాయం. అయితే అనుసరించేటప్పుడు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణుల పరివేక్షణలోప్రారంభించాలట. ఇలాంటి వాడటానికి సిగ్గపడాల్సిన పనిలేదంటున్నారు మెహతా. 

అయితే వాటితోపాటు సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అవలంభిస్తే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవని చెబుతున్నారు. భారత్‌లో ఎలి లిల్లీ  లాంఛ్‌ చేసిన ఈ ఔషధం మౌంజారో గేమ్-ఛేంజర్ కావచ్చని..భవిష్యత్తులో మరిన్ని సంచలనాలను సృష్టిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..)

 

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)