తస్మాత్‌ జాగ్రత్త..! అన్నివేళలా మంచి ఆరోగ్యానికి చేటు..!

Published on Fri, 02/06/2026 - 16:24

కొందరు అమ్మాయిలు ఎవర్ని నొప్పించకుండా అందరి దృష్టిలో మంచి అనిపించుకునేలా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకోసం తమను తాము మార్చుకోవడం, సర్దుబాటు చేసుకోవడం చేస్తుంటారు. అది ఓ మోస్తారు స్థాయిలో ఉంటే పర్లదు. తనను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేలా పరిస్థితులు ఉన్నప్పుడూ కూడా..మంచి వ్యక్తిలా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ధోరణిలో ఉంటే మాత్రం అంతరంగికి ప్రశాంతత కనుమరుగవ్వుతుంది. అదికాస్త శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి భారీ మూల్యం చెల్లించేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

అందుకే సాధ్యమైనంత వరకు అన్నివేళలా మంచి అ‍మ్మాయిలా ఉండటం సురక్షితం కాదని నొక్కి చెబుతున్నారు. ఎప్పుడు మంచిగా ఉండటం కోపానికి మించి ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్‌​ కోచ్‌ పూర్ణిమ. అంతేగాదు ఆమె దీన్ని "గుడ్ గర్ల్ సిండ్రోమ్"గా పిలిచారు. మంచి అమ్మాయిగా ఉండండి కానీ..మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా మాత్రం కాదు. లేదంటే అది ఒక విధమైన ఒత్తిడికి గురిచేసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అదెలాగంటే..

దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక కార్టిసాల్
ఎప్పటికీ ఇతరులను సంతోషపెట్టాలని అనుకుంటే..సదా నాడీ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అది ఒక అలవాటులా మారి నో చెప్పడం, హద్దులు నిర్ణయించడం అసురక్షితంగా మారి..అభద్రతాభావంలోకి నెట్టేస్తుంది. దాంతో ఒత్తిడి బారినపడి శరీరంలో కార్టిసాల్‌ స్టాయిలను పెంచేస్తుంది. ఫలితంగా నిద్ర లేమి, అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

థైరాయిడ్ అసమతుల్యత
ఇలా మంచి అనిపించుకునే ధోరణి భావోద్వేగాలను అణిచేస్తుంది. అంటే కోపాన్ని అణిచేసి, గొతు పెగలనీయకుండా చేస్తుంది. దాంతో థైరాయిడ్‌ బారిన పడతామని అంటున్నారు.

జీర్ణ సమస్యలు
మన భావాలు ఎప్పుడైతే వ్యక్తీకరించలేకపోతే..జీర్ణక్రియపై ప్రభావం చూపి.. ఉబ్బరం, ఆమ్లత్వం  IBS లాంటి లక్షణాలు సాధారణం. భావోద్వేగాలు ప్రాసెస్ చేయబడనప్పుడు శరీరం ప్రతిస్పందిస్తుందట. అదీగాక అధ్యయనం ప్రకారం, ఒత్తిడి శరీరం జీర్ణక్రియను నెమ్మదిస్తుంది లేదా పాజ్ చేయమని సూచిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ దెబ్బతిని..తిన్నది ఒంటబట్టలేని సమస్యను ఎదుర్కొంటారట.

హార్మోన్ల అసమతుల్యత, అలసట
ఇక్కడ "మంచిగా" ఉండటం చాలా శక్తిని ఖర్చు చేస్తుంది. అంటే ఇక్కడ శరీరం ప్రతిసారి మనుగడ అనే మోడ్‌లోనే ఉండాలి. దాంతో హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి..వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లుతుంది. నిరంతరం అలసటకు గురవ్వుతారట.

ఆందోళన, భావోద్వేగ అలసట
ఎల్లప్పుడూ మంచిగా ఉండటం వల్ల విశ్రాంతి లేదా ప్రామాణికతకు చోటు ఉండదు. ఆందోళన పెరుగుతుంది. భావోద్వేగ అలసట ఒక వ్యసనంగా మారుతుంది. నిజానికి బయటకు ప్రశాంతంగా కనిపించిన..లోలోపల కుంగిపోయి అలసిపోతారట.

దీనికి వైద్యం మిమ్మల్ని మార్చుకోవాలనే సంకల్పానికి పునాది వేయడమే అని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్‌ కోచ్‌. ఇది నిజాయితీగా వ్యవహరించటంతో మొదలైన "మంచి" మిమిల్ని అన్నిరకాలుగా ముంచేయడం ప్రారంభిస్తుందన్నది గ్రహించాలి. అసురక్షితమైన స్థితికి తీసుకువచ్చే మంచిని వదులుకోవడమే అన్ని వేళల మంచిదని అంటోందామె. దాంతోపాటు శరీరం మాట వినాలి. మనకు అనుకూలంగా సాధ్యమైనదే అయితే.. దానికే సుముఖత వ్యక్తం చేయాలి. 

సాధ్యమైనంత వరకు కొన్నింటికి "నో" అని ఎంత మేర చెప్పగలుగుతామో అప్పుడు మనం మానసికంగా, శారీరకంగా సురక్షితంగా, స్ట్రాంగ్‌గా ఉండగలుగుతారని అన్నారు. అతి సర్వత్ర వజ్రయేత్‌ అనిపెద్దలు చెప్పిన నానుడిలా అతి మంచి పనికిరాదని గుర్తెరగండి అని సూచిస్తున్నారు నిపుణులు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: మెట్లపై నడుస్తూ ఫోన్‌ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్..)
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)