Breaking News

గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్‌ కుల్ఫీ'..! ధర ఎంతంటే..

Published on Sun, 05/18/2025 - 16:02

విలాసవంతంమైన ఆహారపదార్థాలను ఎన్నో చూశాం. కానీ ఐస్‌క్రీం డిజర్ట్‌లలో గోల్డ్‌తో చేసింది చూసుండరు. దీన్ని విక్రయించే వ్యక్తి సైతం గోల్డ్‌ మ్యాన్‌లా మెరిసిపోతుండటం విశేషం. ఇంతకీ ఎక్కడ ఈ గోల్డ్‌ కుల్ఫీని అమ్ముతున్నారంటే..

ఇండోర్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన పురాతన సరఫా బజార్‌లో ఈ 24 క్యారెట్ల గోల్డ్‌ కుల్ఫీ దొరకుతుంది. అక్కడ ఈ విలాసవంతమైన డెజర్ట్‌ తోపాటు ఫలూడా, ది గోల్డ్ మ్యాన్ జామున్, రబ్డీ వంటి వివిధ రుచులను సైతం అందిస్తోంది. ఇక్కడ ప్రత్యేకతే ఏంటంటే..ఈ గోల్డ్‌ కుల్ఫీని అందించే వ్యక్తి ఒంటి నిండా గోల్డ్‌తో ధగ ధగ మెరిసిపోతూ కనిపిస్తుంటాడు. 

బహుశా అదే అతడి సేల్స్‌ ట్రిక్‌ ఏమో గానీ..చూడటానికి మాత్రం ఏదో లగ్జరీయస్‌ హోటల్‌కి వచ్చామా..! అనే డౌటు వచ్చేస్తుందని అంటున్నారు అక్కడ స్థానికులు. అత్యంత ఆడంబరంగా కనపించే వీధి దుకాణమే ఇది. ఒరిజనల్‌ గోల్డ్‌తో తయారయ్య ఈ కుల్ఫీ ధర వచ్చేసి రూ. ₹351-401ల మధ్య ఉంటుందట. 

ఇది శతాబ్దాల నాటి పాక సంప్రదాయానికి పరాకాష్ట. ఇండోర్‌ సందర్శించడానికి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా ఈ కుల్ఫీని తిని చూడకుండా వెళ్లరట. 

'సరఫా' అనే పేరు ఎలా వచ్చిందంటే..
హోల్కర్ రాజవంశం సమయంలో 18వ శతాబ్దం నాటి ఈ మార్కెట్ బంగారం, వెండి వ్యాపారుల వాణిజ్య కేంద్రంగా ఉండేదట. అందుకే దీనికి  "సరఫా" అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక హిందీలో దీని అర్థం బులియన్. కానీ చీకటి పడుతుందనగా.. ఈ ప్రాంతంలోని ఆభరణాల దుకాణాలు మూతపడిపోతాయి..

రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో..అత్యంత ఫేమస్‌ అయిన ఈ గోల్డ్‌ కుల్ఫీ దుకాణం అమ్మకాలు ప్రారంభమవుతాయట. చిరుతిండికి ఫేమస్‌ ఈ బజార్‌. ఈ కుల్ఫీ దుకాణమే కాకుండా రుచికరమైన జిలేబీలు, స్పైసీ దాల్‌ బఫ్లా వంటి చిరుతిండ్లకు చిరునామా ఇది. భద్రత దృష్ట్యా మొదలైన ఈ మార్కెట్‌ క్రమంగా విస్తరించిందట. 

చివరగా ఈ సరఫా బజార్‌లో ది గోల్డ్‌మ్యాన్‌ విక్రేత అందించే బంగారు కుల్ఫీ ప్రత్యేక ఆకర్షణగా హైలెట్‌గా నిలిచిన డెజర్ట్‌. ఇది ఒక రకంగా రుచితోపాటు..సర్వ్‌ చేసే వ్యక్తి దృశ్యం.. కస్టమర్‌ని ప్రభావితం చేసేలా అమ్మకాలు జోరందుకుంటాయనే విషయాన్ని హైలెట్‌ చేసింది.

(చదవండి: టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్‌కార్న్‌, మ్యాంగో కేక్‌ చేద్దాం ఇలా..!)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)