Breaking News

గోవా వెళ్తున్నారా? ఈ విషయం తెలుసా? రూ.లక్ష కట్టాల్సిందే...

Published on Wed, 08/06/2025 - 17:18

దేశంలో పర్యాటకుల్ని అత్యధిక సంఖ్యలో ఆకర్షించే రాష్ట్రం గోవా...అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ పర్యాటకులను కూడా ఇక్కడ బీచ్‌లను సందర్శించడానికి భారీ సంఖ్యలో వస్తుంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు గోవాకి మహరాజ పోషకులుగా ఉన్నారు. అంతేకాదు గోవాలో క్యాసినోలు సహా అనేక వ్యాపారాలు నడిపేవారిలోనూ తెలుగువారి వాటా పెద్దదే. దాంతో గోవా కు తెలుగు రాష్ట్రాలకు మధ్య రాకపోకలు భారీగానే సాగుతుంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా గోవా ప్రభుత్వం విధించిన పలు నిబంధనలు మన తెలుగు వారు కూడా తప్పక తెలుసుకుని గుర్తుంచోవాల్సిన విషయంగా మారింది.

మరోవైపు గతంతో పోలిస్తే రాష్ట్రం పర్యాటక పరంగా ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో పర్యాటక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గోవా ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.  రోడ్లపై చెత్తను అక్రమంగా పారవేస్తే కఠినమైన జరిమానాలు విధించనుంది.  ఈ తరహాలో పదేపదే ఉల్లంఘనకు పాల్పడితే  రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే బిల్లును ఆమోదించింది. 

దీని కోసం గోవా బయోడిగ్రేడబుల్‌ చెత్త (నియంత్రణ) చట్టం, 1996 కు సవరణను చేసింది. నదులు, సరస్సులు  కాలువలు వంటి సున్నితమైన నీటి వనరులతో సహా ప్రభుత్వ  ప్రైవేట్‌ ప్రదేశాలలో చెత్త పారవేయడాన్ని నియంత్రించడం దీని లక్ష్యం. కొత్త నిబంధనల ప్రకారం, చెత్తను వేస్తూ పట్టుబడిన వ్యక్తులు మొదటి నేరానికి రూ. 200 నుంచి ప్రారంభమయ్యే జరిమానా తదుపరి ఉల్లంఘనలకు పెంచుకుంటూ పోతారు. అలా అలా ఏకంగా రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. 

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పరిశ్రమలు ఉత్పత్తి చేసే వ్యర్థాలను పర్యవేక్షించడానికి అక్రమ డంపింగ్‌లో పాల్గొన్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ బిల్లు గోవా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకి అధికారం ఇస్తుంది. సవరించిన చట్టం ప్రకారం బయోడిగ్రేడబుల్‌ బయోడిగ్రేడబుల్‌ కాని వ్యర్థాలను కాలువలు, వెంట్లు, మురుగు కాలువలు, క్వారీ షాఫ్ట్‌లు లేదా పర్యావరణాన్ని కలుషితం చేసే లేదా మురుగునీటి వ్యవస్థలకు ఆటంకం కలిగించే ప్రదేశాలలో వేయడం నిషేధం.

చెత్త సేకరణ కేంద్రాలను గుర్తించి తెలియజేయడానికి స్థానిక సంస్థలు ఇప్పుడు బాధ్యత వహిస్తాయి. ఆస్తి యజమానులు, ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు  బ్రాండ్‌ యజమానులతో సహా అందరూ అధీకృత వ్యర్థాల ఏజెన్సీలను ఉపయోగించి వారి ప్రాంగణాల నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను సరైన రీతిలో నిర్మూలించాలి.  బల్క్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు, సేకరించేవారు, రీసైక్లర్లు  కో–ప్రాసెసర్లు  ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి  గెజిట్‌–నోటిఫైడ్‌ విధానాల ప్రకారం అధికారాన్ని పొందాలి.

రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ  పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడానికి గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక అడుగు ఇది. సరైన అనుమతలు లేకుండా నీటిలో పడవలు నడపడం, వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయమని పర్యాటకులను ఇబ్బంది పెట్టడం, అనధికార ప్రాంతాలలో మద్యం సేవించడం లేదా రోడ్లపై, బహిరంగంగా గాజు సీసాలు పగలగొట్టడం, బహిరంగ ప్రాంతాలలో వంట చేయడం, చెత్త వేయడం, నియమించబడని మండలాల నుంచి వాటర్‌ స్పోర్ట్స్‌ లేదా టిక్కెట్ల అమ్మకాలు నిర్వహించడం, అనధికార హాకింగ్, భిక్షాటన చేయడం లేదా బీచ్‌లలో వాహనాలను నడపడం  రాష్ట్రం వెలుపలి ప్రదేశాలకు అనుమతి లేకుండా పర్యాటక సేవలను విక్రయించడం వంటి పలు నిషేధిత అంశాలు ఇందులో ఉన్నాయి. 

కాబట్టి వినోదం కోసమో, వ్యాపారం కోసమో..గోవాకు ఏ కారణంతో వెళ్లేవారైనా తాజా నిబంధనల గురించి అవగాహన  పెంచుకుని వెళ్లడం బెటర్‌. ఎందుకంటే ఇలాంటి నిబంధనలు విధించడం మాత్రమే కాదు వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా గోవా ప్రభుత్వానికి బాగా తెలుసు..సో బహుపరాక్‌..

(చదవండి: నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్‌ నీతు మేడమ్‌..)

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)