Breaking News

ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..

Published on Sun, 05/25/2025 - 11:41

కొన్ని పండుగలు ప్రాణాలకే ప్రమాదం అన్నట్లుగా హడలెత్తిస్తాయి. కానీ సంప్రదాయం పేరుతో వాటిని కొనసాగిస్తూనే ఉంటారు. వాటికి అధికారిక మద్దతు కూడా లభిస్తుంటుంది. అలాంటి విచిత్రమైన పండుగే ‘కూపర్స్‌ హిల్‌ చీజ్‌ రోలింగ్‌ ఫెస్టివల్‌’. 

ఈ వేడుక ఇంగ్లాండ్‌లోని గ్లాస్టర్‌షైర్‌లోని బ్రాక్‌వర్త్‌ సమీపంలోని కూపర్స్‌ హిల్‌పై ప్రతి ఏడాది మే చివరి సోమవారం రోజున జరుగుతుంది. ఈ లెక్కన ఈ ఏడాది మే 26న జరుగుతుంది. ఇది ముందు చెప్పుకున్నట్లు కాస్త ప్రమాదకరమైన సంప్రదాయం. ఈ ఉత్సవంలో జరిగే పోటీలో పాల్గొనేవారు దాదాపు 200 గజాల ఎత్తుగల నిటారైన కొండపై నుంచి దొర్లుతున్న డబుల్‌ గ్లాస్టర్‌ చీజ్‌ వీల్‌ (గుండ్రంగా చక్రంలా ఉంటుంది) వెనుక పరుగుపెట్టాల్సి ఉంటుంది. 

ఆ చక్రాన్ని కింద వరకూ వెళ్లి ఎవరు అందుకుంటారో వారే విజేత. అసలు ఈ సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో కచ్చితంగా తెలియదు, కానీ ఇది 1826లో మొదటిసారిగా లిఖితపూర్వకంగా ప్రస్తావించారు. అయితే, ఇది కనీసం 600 సంవత్సరాల నాటి సంప్రదాయమని నమ్ముతారు. 

ప్రస్తుతం, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలు ఈ పోటీలో పాల్గొంటున్నారు. 18 ఏళ్లు నిండితే చాలు ఈ పోటీలో పాల్గొనొచ్చు. కొండ చాలా నిటారుగా ఉండటం వల్ల, చాలామంది బ్యాలెన్స్‌ కోల్పోయి దొర్లుకుంటూ పడిపోతూ ఉంటారు. అయినప్పటికీ, విజేతగా నిలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొండ దిగువన స్థానిక రగ్బీ జట్టు సభ్యులు గాయపడిన వారికి సహాయం చేయడానికి వేచి ఉంటారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది వస్తుంటారు.  

(చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..!      )

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)