Breaking News

గాడ్జెట్ల గల్లీలో బప్పా ఎంట్రీ!

Published on Sun, 09/13/2026 - 04:03

ఇంటికి గణపయ్య వచ్చారంటే పండగ కళ రావాల్సిందే! 
ఇప్పుడు ఆ కళను కాస్త స్మార్ట్‌గా పెంచే చిట్టి గాడ్జెట్లు ఇవిగో... 
దరలో చిన్నవి, పండుగ పనిలో మాత్రం 
పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి.

బప్పా మండపంలో బీట్‌ అదిరిపోవాల్సిందే! 
పిల్లల వినాయక మండపం అంటే పూజలతో పాటు ఆటలు, పాటలు, సందడి కూడా ఉండాల్సిందే! మరి ఆ చిన్నారుల సందడికి పెద్ద సౌండ్‌ సిస్టమ్‌ ఎందుకు? తక్కువ ఖర్చులో ఈ చిన్న బ్లూటూత్‌ స్పీకర్‌ చాలు! 10 వాట్ల సౌండ్‌తో భక్తి పాటలు, గణేశ్‌ పాటలు, పిల్లల ఫేవరెట్‌ మ్యూజిక్‌ ప్లే చేసుకోవచ్చు. మ్యూజిక్‌కు తగ్గట్టు రంగురంగుల డిస్కో లైట్లు మెరుస్తూ ఉంటే... చిన్న మండపమే మినీ డ్యాన్స్‌ ఫ్లోర్‌లా మారిపోతుంది! ఫోన్‌తో బ్లూటూత్‌ ద్వారా సులభంగా కనెక్ట్‌ చేసుకోవచ్చు. చిన్న సైజులో ఉండటంతో పిల్లలు నిర్వహించే చిన్న వినాయక మండపాలకు ఇది బాగా సరిపోతుంది. పైగా పెద్ద స్పీకర్లు, ఖరీదైన సౌండ్‌ సిస్టమ్‌లకు అయ్యే ఖర్చు కూడా ఉండదు. ధర కేవలం రూ.500 మాత్రమే!

గణపయ్యకు... మేకప్‌ రెడీ!
గణపయ్యను తీసుకొచ్చాక...  ఆయన మండపం అలంకరణే అతిపెద్ద టాస్క్‌! పూలు, లైట్లు, అలంకరణ  సామాన్లు అంటూ మార్కెట్‌ చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా... గణపయ్య వెనుక ఈ మండపం పెట్టేస్తే పూజా స్థలానికే ఓ పండగ లుక్‌ వచ్చేస్తుంది. కాగితంతో తయారైన ఈ పర్యావరణహిత అలంకరణను 9 నుంచి 16 అంగుళాల విగ్రహాలకు సరిపడేలా రూపొందించారు. కొద్ది నిమిషాల్లోనే  కుటుంబంతో కలిసి దీన్ని తయారు చేసుకోవచ్చు కాబట్టి... పిల్లలకు ఫన్‌,  పెద్దలకు డెకరేషన్‌   బాధ్యత రెండూ ఒకేసారి! వాడిన తర్వాత మడిచి దాచుకోవచ్చు, పైగా వినాయక చవితి తర్వాతి పండుగల్లో మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ధర సుమారు రూ. 800.

మంత్రాల మినీ మాస్టర్‌!
గణపయ్యపై విపరీతమైన ప్రేమ ఉంది. కానీ మంత్రాలు రావా? పూజ చేయడం కూడా రాదా? పర్లేదు... ఇకపై పూజ చేయటానికి పూజారి కోసం వెతకాల్సిన పనిలేకుండా. ఈ చిన్న మంత్ర బాక్స్‌ పనిచేస్తుంది. ఇందులో 35 రకాల ముందే నిక్షిప్తమైన మంత్రాలు ఉండటంతో పూజ, ధ్యానం, జపం... ఏ సందర్భానికైనా వినొచ్చు. పెద్ద స్పీకర్‌ సెటప్‌ అవసరం లేదు. చిన్న సైజులోనే పూజ గదిలో చక్కగా సరిపోతుంది. బ్యాటరీ లేదా చార్జింగ్‌ టెన్షన్‌   లేకుండా నేరుగా విద్యుత్‌ సాకెట్‌కు అమర్చుకుని ఉపయోగించవచ్చు. కొన్ని క్షణాల్లోనే మనసు భక్తిమయంగా మారిపోయేలా, కావాల్సిన మంత్రాన్ని , శబ్దాన్ని మనకు నచ్చిన స్థాయిలో సర్దుకోవచ్చు. ధర రూ.300. 

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)