Breaking News

గణపతికి నచ్చే వంటకాలు

Published on Sun, 09/13/2026 - 03:55

పాల పాయసం
కావలసినవి:  బియ్యం  – 1 గ్లాస్‌ (కడిగినవి), పాలు : 1 లీటరు, పంచదార / బెల్లం: 1 కప్పు (రుచికి సరిపడా), నెయ్యి, డ్రైఫ్రూట్స్‌ తగినన్ని
తయారి: ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్, ఇతర డ్రైఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు కాగిన తర్వాత మంట తగ్గించి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి మెత్తగా ఉడికించాలి. బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా కలియబెట్టాలి. పాయసం చిక్కగా, కమ్మగా తయారైన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, డ్రైఫ్రూట్స్‌ను వేసి కలపాలి. పాల పాయసం సిద్ధం!

 

రవ్వ పూర్ణాలు 
కావలసినవి: బొంబాయి రవ్వ – 2 కప్పులు, ఏలకలపొడి – 1 టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ – 1/4 కప్పులు, పంచదార – రెండున్నర కప్పులు, నెయ్యి – 1/2 కప్పు, మైదాపిండి – ఒకటిన్నర కప్పు, బియ్యంపిండి – 1/4 కప్పు 
తయారి: బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి 3 వంతులు ఉడికిన తరువాత పంచదార ఏలకలపొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మైదా కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకొని చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోండి.

 

చిట్టి ముత్యాల లడ్డు 
కావలసినవి:  శనగపిండి – 2 కప్పులు, ఏలకలపొడి – 1 టీ స్పూన్, లెమన్‌ ఎల్లోకలర్‌ – చిటికెడు, పంచదార – 2 1/2 కప్పులు, ఆరెంజ్‌ కలర్‌ – చిటికెడు, రిఫైండ్‌ నూనె – వేయించటానికి తగినంత 
తయారి: శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్‌æ కలర్, ఇంకొంత భాగానికి లెమన్‌ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో బూందీ తయారు చేసుకోండి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న పాకంలో బూందీ. యాలకల పొడి కలిపి లడ్డుగా చుట్టుకోండి.

 

తీపి ఉండ్రాళ్ళు 
కావలసినవి: బియ్యంపిండి : 1 కప్పు, 
నీళ్ళు : 1 కప్పు, నెయ్యి : 2 గరిటెలు 
వంట సోడా : చిటికెడు, ఉప్పు : చిటికెడు 
ఉండ్రాళ్ళలో నింపడానికి :  పచ్చి కొబ్బరి కోరు : 1 కప్పు, కొబ్బరి పొడి : 1/2 కప్పు, 
వేయించిన గసాలు : 1 గరిటెడు, ఏలకుల పొడి : 1/2 చెంచా

తయారి: కొబ్బరి, బెల్లం, ఏలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్‌లో వేడి చెయ్యాలి. ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని వేడి చెయ్యాలి. ఉప్పు, నెయ్యి వేసి మరిగిన తరువాత బియ్యం పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపు తుండాలి. తక్కువ మంటపైన పిండిని ఉడికించి గట్టిపడిన తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి. పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి తగు మాత్రం తీసుకుని చేతిలో వెడల్పుగా చేసుకుని మధ్యలో కొబ్బరి పాకాన్ని ఉంచి మూసివేసి, గుండ్రంగా చుట్టాలి. లేదా మీకిష్టమైన ఆకతుల్లో చేసి వీటిని తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్‌లో ఆవిరిపైన ఉడికించాలి. వీటిని వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతితో తింటే చాలా రుచిగా ఉంటాయి.

 

రవ్వలడ్డు 
కావలసినవి: బొంబాయి రవ్వ – 2 కప్పులు, పంచదార – 2 కప్పులు, పచ్చికొబ్బరి – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, 
జీడిపప్పు – తగినన్ని, కిస్‌మిస్‌ – తగినన్ని, 
ఏలకులపొడి – అర టీ స్పూను, నీళ్ళు – 2 టీ స్పూన్లు. 
తయారి: రవ్వని వేయించి పక్కనుంచుకోవాలి. నేతిలో జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించుకోవాలి. పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. పాకంలో రవ్వ, జీడిపప్పు, కిస్‌మిస్, ఏలకుల పొడి కలుపుకుని లడ్డు చుట్టుకోవాలి. తియ్యతియ్యటి రవ్వలడ్డు రెడీ.

Videos

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

రాజీనామా చేసి పార్టీ పెట్టి గెలిచినా నాయకుడు జగన్.. పొత్తు లేకపోతే ఒక్క సీటు గెలిచే దమ్ము లేదు నీకు...

అంబేద్కర్ కోనసీమలో చంద్రబాబుకు బిగ్ షాక్.. ముగ్గురు TDP అధ్యక్షులు రాజీనామా

నువ్వు కాదు కదా నీ... జగన్ పాదయాత్రపై చింతమనేని సవాల్.. కాసు మహేష్ రెడ్డి కౌంటర్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)