Breaking News

అడుగు పడితే, లైట్‌ పడుతుంది!

Published on Sun, 07/26/2026 - 13:26

రోజూ చేసే చిన్న చిన్న పనులే ఎక్కువ సమయాన్ని తినేస్తుంటాయి! అలాంటి పనులను చిటికెలో పూర్తి చేసి, కాస్త స్మార్ట్‌గా మార్చే గాడ్జెట్లు ఇప్పుడు మార్కెట్‌లో బోలెడున్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైనవే ఇవి!

సోలార్‌ వాల్‌ లైట్‌
దొంగలను భయపెట్టి, బయటపెట్టే లైట్స్‌ ఇవి. రాత్రి అందరూ నిద్రలో ఉంటారు... కానీ ఈ లైట్‌ మాత్రం డ్యూటీలో ఉంటుంది! ఎవరైనా ఇంటి గుమ్మం దగ్గరకు రాగానే ‘ఇదిగో దొంగ.. దొంగ!’ అన్నట్లు టక్కున వెలిగిపోతుంది. మోషన్‌  సెన్సర్‌తో పనిచేసే ఈ సోలార్‌ వాల్‌ లైట్‌ దొంగలకు చిన్న షాక్‌ ఇవ్వడమే కాదు... ఇంటి చుట్టూ ఏ కదలిక జరిగినా వెంటనే వెలుతురు వెదజల్లుతుంది. పగలంతా సూర్యరశ్మితో చార్జ్‌ అవుతుంది కాబట్టి కరెంట్‌ బిల్లు పెరుగుతుందేమోనని ఆందోళన అక్కర్లేదు. వర్షం వచ్చినా, ఎండ మండినా వాటర్‌ప్రూఫ్‌ బాడీతో చక్కగా పనిచేస్తుంది. గుమ్మం, బాల్కనీ, తోట, మెట్లు– ఎక్కడ పెట్టినా వెచ్చని పసుపు వెలుతురుతో ఇంటికి అందాన్ని, భద్రతను ఒకేసారి అందిస్తుంది. ధర కేవలం రూ. 300 మాత్రమే!

లెక్కలతో పాటు... లెటర్స్‌ కూడా!

కాలిక్యులేటర్‌లో లెక్కలు వేసి... మళ్లీ పక్కన కాగితం కోసం వెతుకుతుంటారా? ఇక ఆ పని లేదు! ఈ టూ ఇన్‌ వన్‌ కాలిక్యులేటర్‌ ఒకేసారి లెక్కలూ వేస్తుంది, పక్కనే నోట్స్‌ కూడా రాస్తుంది. ఎంత ఖర్చయ్యింది? ఎంత బ్యాలెన్స్‌? వెంటనే రాసేసి, పని అయిపోయాక ఒక్క బటన్‌ తో చెరిపేయొచ్చు. కాగితాలు చింపాల్సిన పని లేదు, చిన్న చిట్టీలు పోగొట్టుకునే టెన్షన్‌  లేదు. మడతపెట్టే డిజైన్‌ తో జేబులోనో, బ్యాగులోనో హాయిగా సరిపోతుంది. స్టూడెంట్స్, టీచర్లు, ఆఫీస్‌ ఉద్యోగులు, లెక్కలతో పని ఉన్నవాళ్లందరికీ ఇది చిన్న సైజ్‌లో ఉండే పెద్ద హెల్పర్‌. కాలిక్యులేటర్‌ ఒకటి కొంటే, నోట్‌ప్యాడ్‌ కొనాల్సిన అవసరమే లేదు. ధర సుమారు రూ.600.

కత్తెరకు కన్ను!

కత్తిరిస్తుంటే... సరైనా కొలత ఒక వైపు, కత్తెర మరోవైపు వెళ్లిపోతున్నాయా? ఇక ఆ టెన్షన్‌ కు కట్‌! ఈ లేజర్‌ కత్తెర ముందే ఎర్రటి లేజర్‌ గీతను చూపిస్తూ ‘ఇదే దారి... ఇటే కట్‌ చెయ్‌!’ అని గైడ్‌ చేస్తుంది. కాబట్టి వంకర టింకరలు లేకుండా సూటిగా కత్తిరించొచ్చు. బట్టలు, గిఫ్ట్‌ పేపర్లు, కార్డ్‌బోర్డులు, క్రాఫ్ట్‌ పనులు... ఏది కత్తిరించినా ఫినిషింగ్‌ మాత్రం ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ బ్లేడ్‌లు పదునుగా ఉండటంతో ఎక్కువ శ్రమ కూడా ఉండదు. చేతికి నొప్పి కలగకుండా సౌకర్యవంతమైన పట్టుతో డిజైన్‌  చేశారు. ఇంట్లో చిన్న చిన్న క్రాఫ్ట్‌ పనులు చేసే వాళ్ల నుంచి టైలర్లు, బొటిక్‌ యజమానుల వరకు అందరికీ ఇది సూపర్‌ హెల్పర్‌. ఇకపై ముందు గీత గీసే పని లేకుండా, లేజర్‌ చూపించిన దారిలో కట్‌ చేయడమే! ధర కేవలం రూ. 350 మాత్రమే!

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)