Breaking News

మొక్కలను కాపాడే స్మార్ట్‌ కుండీ ఇదే!

Published on Sun, 07/28/2024 - 10:10

ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి కుండీలను వాడుతుంటాం. ఇంటి అందం కోసం కుండీలను ఏర్పాటు చేసుకున్నా, వాటిలోని మొక్కల ఆలనా పాలనా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొక్కల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటే, అవి ఎండిపోయి, చనిపోతాయి. మొక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి, అందుకు అనుగుణంగా వాటి బాగోగులను చూసుకోవడం కష్టమే!

ఈ సమస్యను తొలగించడానికే అమెరికన్‌ కంపెనీ ‘స్మార్టీ ప్లాంట్‌’ సంస్థ కుండీల్లోని మొక్కల రక్షణ కోసం స్మార్ట్‌ సెన్సర్‌ను తయారుచేసింది. సెన్సర్‌ అమర్చిన ఈ స్మార్ట్‌ కుండీల్లోని మొక్కలకు సునాయాసంగా రక్షణ కల్పించవచ్చు. అవి నిత్యం పచ్చగా కళకళలాడేలా చూసుకోవచ్చు. ఈ కుండీల్లోని స్మార్ట్‌ సెన్సర్‌ యాప్‌ ద్వారా పనిచేస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, కుండీలోని మట్టిలోని తేమ, మొక్కల వేళ్లు, కాండంలోని పోషకాల పరిస్థితులను ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా సమాచారం అందిస్తుంది. దీని ధర 45 డాలర్లు (రూ.3,760) మాత్రమే!

పిల్లల కోసం ఫిట్‌నెస్‌ వాచీ..
రక్తపోటు, గుండె పనితీరు, శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి వంటి వివరాలను చెప్పే స్మార్ట్‌ వాచీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ పెద్దల కోసం రూపొందించినవి. అయితే, అమెరికన్‌ కంపెనీ ‘ఫిట్‌బిట్‌’ ప్రత్యేకంగా పిల్లల కోసం ‘ఏస్‌ ఎల్‌టీఈ’ పేరుతో ఈ ఫిట్‌నెస్‌ వాచీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ సెన్సర్లు పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తాయి.

ఆ సమాచారాన్ని యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తాయి. ఈ వాచీని ఫోన్‌లా కూడా ఉపయోగించుకునే వీలు ఉంది. ఇందులోని కమ్యూనికేషన్స్‌ టాబ్‌ ద్వారా అవసరమైప్పుడు కాల్స్‌ చేసుకోవడానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి కూడా వీలవుతుంది. ఏడేళ్లకు పైబడిన వయసు గల పిల్లలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ‘ఫిట్‌బిట్‌’ కంపెనీ చెబుతోంది. దీని ధర 229 డాలర్లు (రూ.19,126) మాత్రమే!

నానోబాక్స్‌ మినీ డ్రమ్స్‌..
మృదంగం, తబలా, డ్రమ్స్‌ వంటి తాళ వాయిద్యాలు లేకుండా సంగీత కచేరీలు పరిపూర్ణం కావు. అయితే, ఈ పరికరాలు కొంచెం భారీగా ఉంటాయి. ఆక్టోపాడ్‌ వంటి ఎలక్ట్రిక్‌ డ్రమ్స్‌ అందుబాటులోకి వచ్చినా, అవి కూడా కొంచెం భారీగా ఉండేవి, స్థలాన్ని ఆక్రమించుకునేవే! అమెరికన్‌ సంగీత పరికరాల తయారీ సంస్థ ‘1010 మ్యూజిక్‌’ ఇటీవల డ్రమ్స్‌ను అరచేతిలో ఇమిడిపోయే పరిమాణానికి కుదించి, ‘నానోబాక్స్‌’ను అందుబాటులోకి తెచ్చింది.

‘రాజ్‌మాటాజ్‌’ పేరుతో రూపొందించిన ఈ మినీ డ్రమ్స్‌ను మిగిలి ఎలక్ట్రానిక్‌ సంగీత పరికరాల్లాగానే వాడుకోవచ్చు. ఈ ‘నానోబాక్స్‌’ పొడవు 3.75 అంగుళాలు, మందం 1.5 అంగుళాలు, వెడల్పు 3 అంగుళాలు. ఇందులోని 64 స్టెప్‌ సీక్వెన్సర్‌ ఔత్సాహికుల సాధనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ నానోబాక్స్‌కు ఉన్న టచ్‌స్క్రీన్‌ ద్వారా కోరుకున్న ధ్వనులను, శబ్దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర 399 డాలర్లు (రూ.33,327) మాత్రమే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)