శిఖర్ ధావన్ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ తెలిస్తే కంగుతినాల్సిందే..!

Published on Tue, 12/10/2024 - 15:13

భారత మాజీ క్రికెటర్‌, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ శిఖర్ ధావన్ మైదానంలో అడుపెడితో ధనాధన్‌ సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ధావన్‌ పరుగుల విధ్వంసానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అంతలా తన ఆటతో కట్టిపడేసే ధావన్‌​ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నుంచి కూడా రిటైర్మెంట్‌ తీసుకున్నారు. ప్రస్తుతం నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఎన్‌పీఎల్‌)తో బిజీగా ఉన్నాడు. ఇంతలా శక్తిమంతంగా ఆడలాంటే అంతే స్థాయిలో బాడీని, ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. అందుకోసం ధావన్‌ ఎలాంటి వర్కౌట్లు, డైట్‌ తీసుకుంటారో తెలుసా..!.

శిఖర్‌ ధావన్‌ వారంలో రెండు నుంచి మూడు కఠినమైన జిమ్‌ సెషన్‌లు తప్పనిసరిగా చేస్తాడు. వాటిలో కార్డియో వర్కౌట్‌లు కూడా ఉంటాయట. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ప్రాథమిక వ్యాయామానికి ముందు బాడీ చురుకుగా ఉండేలో గ్లూట్‌ వ్యాయమాలు, మొబిలిటీ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటివి చేస్తానని చెప్పుకొచ్చాడు. ధావన్‌ యోగా ప్రేమికుడు కూడా. యోగాసనాలు రోజువారీ దినచర్యలో కచ్చితంగా ఉంటాయి. 

అయితే ధావన్‌ ఎక్కువగా రన్నింగ్‌ ఎక్సర్‌సైజుని ఎంజాయ్‌ చేస్తానని చెబుతున్నారు. ఇది శరీరం అంతటా రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుందట. ఏదైన వర్కౌట్‌లు చేయడానికి ముందు కనీసం 30 నిమిషాలు శరీరం వేడెక్కేలా రన్నింగ్‌ లేదా జాగింగ్‌ చేయాలని సూచిస్తున్నాడు ధావన్‌. చివరిగా మానసిక ఆరోగ్యం కోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, సూర్యనమస్కారాలు కూడా చేస్తానని అంటున్నారు ధావన్‌. 

డైట్‌..

  • గబ్బర్‌గా పిలిచే ధావన్‌ ఎక్కువగా కాల్చిన చికెన్‌, బంగాళదుంపలు, సాల్మన్‌, బ్రోకలీ తదితర కూరగాయాలను ఇష్టంగా తింటారు. వీటితోపాటు ఆలూ పరాటాలు, దోసెలు, చికెన్‌ కర్రీ వంటివి కూడా తింటానని చెబుతున్నారు. 

  • ఈ ఫుడ్‌ తనకు కఠినమైన వ్యాయామాల సమయంలో హెల్ప్‌ అవుతుందని చెబుతున్నాడు

  • ప్రోటీన్‌ రిచ్‌ డైట్‌కి ప్రాధాన్యత ఇవ్వనని చెబుతున్నారు. శక్తి కోసం పిండి పదార్థాలు తప్పనసరి అని వాదించారు కూడా. తాను ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటానని చెప్పారు.

  • అథ్లెట్లకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం అవసరమనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ "శక్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లే ప్రధానమని నమ్ముతా అని చెప్పారు ధావన్‌.

(చదవండి: స్నానం చేయడం పాత ట్రెండ్‌! ఇలా మూడ్‌ని బట్టి..)

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)