Breaking News

46 దేశాలు పర్యటించా..కానీ భారత్‌ పర్యటన..!

Published on Mon, 05/04/2026 - 13:37

భారతదేశ పర్యటన గురించి ఓ విదేశీ యాత్రికుడు సోషల్‌ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను ఎన్నో దేశాలను పర్యటించానని, కానీ భారత్‌ పర్యటన తన ప్రయాణ అనుభవాన్నే మార్చేసిందంటూ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. అంతేగాదు ఒక ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్‌  చేసుకున్నారు. 

ఆ వీడియోలో the_globedigger గా ప్రసిద్ధి చెందిన జెఫ్ జోసీకి భారతదేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ పర్యటన తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వెల్లడించారు. తాను మొత్తం 46 దేశాలను పర్యటించానని, ఒక యాత్రికుడికి విజయవంతమైన పర్యటన అంటే..ఎలాంటి ఆటంకాలు లేని ఏర్పాట్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు అని అర్థం. 

కానీ భారతదేశంలో చేసే ప్రయాణం ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుందని అన్నారు. అంతేగాదు ఇక్కడ ప్రయాణం చాలా అరుదుగా సులభంగా ఉంటుందన్నారు. ఇక్కడ పర్యటన సౌకర్యానికి చాలా దూరంగా ఉంటుందని అన్నారు. అయినప్పటికీ ఆ సవాళ్లే..ఆ గమ్యస్థానాన్ని అత్యంత అపురూపమైనదిగా మార్చేస్తాయని నొక్కి చెప్పారు. అలాగే భారత్‌లో ప్రపంచంలోని అత్యుత్తమమైన వీధి ఆహారాలు, ప్రపంచస్థాయి బీచ్‌లు ఉన్నాయిన పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆయన గోల్డెన్ టెంపుల్‌తో సహా "ప్రముఖ" దేవాలయాలను సందర్శించడం చూపించారు. 

ఆయన జైపూర్‌లోని హవా మహల్, ఆగ్రాలోని తాజ్ మహల్, ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలోని ఇండియా గేట్‌ను కూడా సందర్శించారు. 46 దేశాలు పర్యటించిన తర్వాత భారత్‌ తనకు ప్రయాణం పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చేసింది అంటూ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చి మరి పోస్ట్‌ చేశారు. అంతేగాదు ఇక్కడ పర్యటన అంత సులభమైన గమ్యస్థానం కాదు, సౌకర్యవంతంగా ఉండకపోయినా..మదిలో నిలిచపోతుంది అంటూ భారత్‌ పర్యటనపై పొగడ్తల వర్షం కురిపించారు. 

అలాగే భారత్‌ మనల్ని నెమ్మదించేలా, పరిస్థితులకు అలవాటు పడేలా చేయడమే గాక ప్రపంచాన్ని విభిన్నంగా చూపించేలా చేస్తుందని, ఓ పర్యాటకుడు చవి చూడాల్సింది కూడా ఇదేనంటూ భారత్‌పై ప్రశంసంల వర్షం కురిపించారు. నెటిజన్ల కూడా ఆయనతో ఏకీభవిస్తూనే..ఈ నేలపై మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు చూడాలంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  

 

(చదవండి: ఆ ట్రైన్స్‌ జర్నీ జస్ట్‌ ట్రావెల్‌ కాదు ..అదొక ఎక్స్‌పీరియెన్స్‌)

 

 

Videos

TVK విజయ్ కు తెలుగు హీరోలు శుభాకాంక్షలు

MGR తర్వాత.. విజయ్ రికార్డ్ TVK విజయ దుందుభి

విజయకి జేజేలు అయ్య.. అమ్మ.. అన్న

సినిమా నుంచి CM వరకు.. విజయ్ ప్రస్థానం

రియల్ జన నాయగన్, పార్టీ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు..

పొత్తుల్లేవు... జెండాలు మోసే కూలి కాదు విజయ్ తిరుగులేని ప్రస్థానం

Tamilnadu Results: MLA గా స్టాలిన్ ఓటమి...!

TVK సంచలనం. 50 ఏళ్ల పార్టీలను మట్టి కరిపించిన విజయ్

మా బావ గెలుపు చాలా ఆనందంగా ఉంది

దూసుకుపోతున్న విజయ్ మ్యాజిక్ ఫిగర్ దగ్గర TVK

Photos

+5

స్విట్జర్లాండ్ వేకేషన్‌లో పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌ (ఫొటోలు)

+5

కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)