Breaking News

అందరిలా కాదు.. నీలా నువ్వుండు చాలు!

Published on Sat, 07/04/2026 - 09:55

మనకు లేనిదానిపైనే మన చూపంతా.. యువతలో బాగా ప్రబలుతున్న ఈ మానసిక నిర్లిప్తత ఇప్పుడు బడికెళ్లే పిల్లల్లోనూ కనిపిస్తోంది. సోషల్‌ మీడియా ప్రభావం పెద్దలకే కాదు.. చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ కన్నవాళ్లను కలవరపెడుతోంది. ‘అందరూ ఏదేదో చేస్తున్నారు.. ఎక్కడికంటే అక్కడికెళుతున్నారు వారిలా నేనెందుకు లేను.. వారిలా నేనెందుకు ఏ పనీ చేయలేకపోతున్నాను.. ’ఈ భావననే ‘ఫెమో’ (ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌) అంటారు. ఎప్పుడూ ఎదుటివారిలా తానెందుకు ఉండలేకపోతున్నానని బాధపడడం, ఎప్పుడూ తనని తాను నిందించుకుంటూ ఉండడం, కోపం వచ్చినా.. దానిని ఎవరి మీద చూపించాలో తెలియక అవస్థలు పడడం... ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే ఏం చేయాలో వెంటనే ఈ సూచనలు పాటించడం మంచిది.

ఎవరిలో ఫెమో ఉంది?
1. తరచూ ఫోన్‌లో తన వయసువాళ్ల వీడియోలు, రీల్స్‌ చూడడం, తనెందుకు చేయలేకపోతున్నానని బాధపడడం
2. తమకు లేని ప్రతిభ కోసం లేదా తమ దగ్గర లేని వస్తువుల కోసం పట్టుబట్టడం.
3. ప్రతి విషయానికీ ఇతరులతో పోల్చుకోవడం. ఆత్మన్యూనతాభావానికి లోనవ్వడం.
4. చిన్న పొరపాటు జరిగినా తమని తాము నిందించుకోవడం.
5. ఏ పని చేయాలన్నా ఆసక్తి కనబరచక పోవడం, ఒంటరిగా ఫీలవ్వడం.

ఏం చేయాలి?
1. ఫెమో సమస్య కి విరుగుడు జెమో (జాయ్‌ ఆఫ్‌ మిస్సింగ్‌). పిల్లల ప్రవర్తన చూసి తల్లిదండ్రులు వారిని మందలించడం కంటే ప్రతిరోజు వారితో కాస్త సమయం గడపాలి. వారి సమస్యల్ని వినాలి. 
2. సోషల్‌ మీడియాలో కనిపించేదంతా నిజ జీవితం కాదని వారికి అర్థమయ్యేలా చె΄్పాలి.
3. స్క్రీన్‌ టైమ్‌కు పరిమితులు విధించి, ఆటలు, పుస్తక పఠనం, సంగీతం, కుటుంబంతో కలిసి గడిపే సమయాన్ని ్రపోత్సహించాలి. 
4. ఎవరినో చూసి వారిలా ఉండాలని కోరుకోవడం కన్నా నువ్వు నీలా ఉంటేనే మంచిదని తెలిసేలా చేయాలి.
5. నచ్చిన పని చేసినప్పుడు వచ్చే అనుభూతే నిజమైన ఆనందమని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)