Breaking News

భారత డిజైనర్లు రూపొందించిన దుస్తుల్లో రాజదంపతులు!

Published on Wed, 11/18/2026 - 12:28

Both opting for outfits by Indian designers: ముంబైలో జరిగిన ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ అవార్డు వేడుకల్లో కేట్‌ మిడిల్‌టన్‌, ప్రిన్స్‌ విలియం దంపతులు భారత డిజైనర్లు రూపొందించిన దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారు. కేట్ ధరించిన మహిమా మహాజన్ రూపొందించిన ఎరుపు రంగు అనార్కలీతో ఈ వేడుకకు సాంప్రదాయ హుందాతనాన్ని తీసుకురాగా, విలియం మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా తయారు చేసిన నలుపు రంగు బంద్‌గాలాలో క్లాసిక్‌గా కనిపించారు. 

కేట్ ధరించిన పొడవాటి అనార్కలీ దాని గాఢమైన ఎరుపు రంగు, క్లిష్టమైన డిజైన్లతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ దుస్తుల నిండా సున్నితమైన బంగారు చుక్కల డిజైన్లు ఉన్నాయి. బిగుతుగా ఉండే పైభాగం విశాలమైన స్కర్ట్‌గా మారింది.మెడ, నడుము మరియు కఫ్‌ల వద్ద క్లిష్టమైన ఆకుపచ్చ, వెండి అలంకరణలు ఎరుపు రంగు దుస్తులకు భిన్నమైన రూపాన్ని ఇచ్చాయి. ఇక వేల్స్‌ యువరాణి తన అలంకరణను పొరలుగా ఉండే వజ్రాల నెక్లెస్‌, ‍ప్రత్యేక చెవిపోగులను ధరించారు. 

తన డ్రెస్‌కి మ్యాచింగ్‌ పర్స్‌ పట్టుకుని శిల్పంలా మెరిశారామె. ఇక వేల్స్ యువరాజు, మనీష్ మల్హోత్రా రూపొందించిన ప్రత్యేకమైన నల్లటి బంద్‌గలాను ధరించారు. ఇది చక్కటి ఆకృతి,ఎత్తైన కాలర్‌, ముందు భాగం వరుసలో బటన్లతో క్లాసిలుక్‌ని అందించింది. దీనికి నల్లటి ఫ్యాంట్‌, ఫార్మల్‌ షూస్‌ జత చేశారు. 2016 తర్వాత మల్లీ ఇప్పుడే భారత్‌ పర్యటనకు వచ్చారు ఆ దంపతులు. 

కాగా, ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ వేడుకలో ప్రకృతిని రక్షించడం, పరిరక్షించడం, పునరుద్ధరించడం, మన గాలిని శుభ్రపర్చడం, మహాసముద్రాలను పునరుజ్జీవింప చేయడం, వ్యర్థ రహిత ప్రపంచాన్ని నిర్మించడం, వాతావరణాన్ని సరిదిద్దడం, అనే ఐదు విభాగాలలో 15 మంది ఫైనలిస్టులను గుర్తించి వారిలో ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తారు.  

 

ఇదీ చదవండి: కర్బీ నృత్యంతో అద్భుత రికార్డు..ఒకేసారి 15 వేల మందికి పైగా..

 

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)