Breaking News

రాజసం ఉట్టిపడే ఊదా రంగు పట్టు చీరలో నీతా స్టన్నింగ్‌ లుక్‌..!

Published on Sat, 07/04/2026 - 10:34

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌ ఎప్పటికప్పుడు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని చాటి చెప్పే చీరలతో అలరిస్తుంటారు. నీతా ధరించే ప్రతీ చీర కళకారుల పనితరం..నాటి వస్త్ర చారిత్రకకళా వైభవాన్ని తెలుసుకునేలా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయి. ఎప్పటిలానే ఈసారి కూడా ప్రకాశవంతమైన చీరలో అద్భుతంగా మెరిశారామె. ఫ్యాషన్‌ పరంగా తనకు సాటిరారెవ్వరూ అని మరోసారి నిరూపించింది.

ఇటీవల, ఫ్లోరిడాలోని టాంపాలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) నిర్వహించిన ఒక కార్యక్రమంలో నీతా అంబానీని హ్యుమానిటేరియన్‌ అవార్డుతో సత్కరించారు. ఈ ప్రతిష్టాత్మక సందర్భం కోసం, భారతదేశపు గొప్ప వస్త్ర వారసత్వాన్ని చాటిచెప్పే, గులాబీ-ఊదారంగుల అద్భుతమైన కలయికలతో ఉన్న పట్టుచీరతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ చీరకు మ్యాచింగ్‌గా గులాబీరంగు బ్లౌజ్‌ని జత చేశారు. 

ఈ చీర భారతీయ చేనేత వస్త్రాల శాశ్వత ఆకర్షణను అందంగా ప్రదర్శించింది. ముదురు గులాబీ రంగు అంచు పల్లుతో కూడిన గాఢమైన ఊదారంగు చీర మరింత శోభాయమానంగా కనిపించింది. ప్రకాశవంతమైన ఆకుపచ్చ అంచు,  పురాతన బంగారు దారాలతో చేసిన సున్నితమైన పూల ఎంబ్రాయిడరీ ఆ చీర అందాన్ని మరింత పెంచేశాయి. ఈ ఎంబ్రాయిడరీ చీర అంంతట కనిపిస్తూ..విలాసవంతమైన ఆకర్షణను అందించింది. సాంప్రదాయ భారతీయ పూల నమునాల నుంచి ప్రేరణ పొందిన ఈ క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, ఈ వస్త్రధారణకు ఒక సుందరమైన కళాత్మక ప్రదర్శనను జోడించింది. 

అలాగే వస్త్రంపై అక్కడక్కడా అల్లిన నమూనాలు, భారతీయ వస్త్ర కళకు పర్యాయపదమైన కళాత్మకతను ప్రతిబింబిస్తూ..దాని హస్తకళా సౌందర్యాన్ని హైలెట్‌ చేసింది. ఆ వస్త్రానికి జతగా, పొట్టి చేతులు,  క్లాసిక్ నెక్లైన్‌తో కూడిన ఆకట్టుకునే ఫ్యూషియా-పింక్ రంగు బ్లౌజ్‌ని ఎంచుకున్నారామె. ఆమె ఆకుప‍చ్చ రంగు పూసల నెక్లెస్‌, దానికి సరిపోయే చెవిపోగులు, ఆకట్టుకునే ఉంగరంతో తన అలంకరణను ఉన్నతంగా తీర్చిదిద్దారు. 

అందుకు తగ్గట్టుగా వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలు, రోజీ పింక్‌ లిప​్‌స్టిక్‌తో లైట్‌వైట్‌ మేకప్‌ని ఎంచుకున్నారామె. ఇక కురులను పాపిడి తీసి వదులుగా వదిలేసి, రాజసం ఉట్టిపడే దుస్తులకు ఒక ప్రత్యేకమైన హుందాతనాన్ని జోడించేలా తన ఆహార్యాన్నిపూర్తి చేశారు.

(చదవండి: తొమ్మిదేళ్లకే ప్రపంచ గుర్తింపు..! ఏకంగా ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఆహ్వానం ..)

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)