నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్‌ షూస్‌ : ఎవరీ అందాల రాణి?

Published on Fri, 05/02/2025 - 16:45

ఫ్యాషన్ ఐకాన్,  అందమైన రాణి.  సాటిలేని అందగత్తె మాత్రమే  కాదు అపర మేధావి కూడా. ఆమె పేరే కూచ్ బెహార్ మహారాణి ఇందిరా దేవి.  అందానికి మించిన తెలివితేటలు, అంతకుమించిన  ఐశ్వర్యంతో తులతూగిన మహిళ. బరోడాలోని విలాసవంతమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో యువరాణిగా పెరిగింది. పాఠశాల, కళాశాలకు వెళ్ళిన తొలి యువరాణి  కూడా ఇందిర కావడం విశేషం. పదండి ఇందిరా దేవి జీవిత విశేషాలు,  విలాసవంతమైన జీవన శైలి గురించి తెలుసుకుందాం.

బరోడా మహారాజు సాయాజిరావు గైక్వాడ్ III , అతని రెండవ భార్య చిమ్నాబాయి II ల కుమార్తె ఇందిర. చాలా చిన్న వయస్సు నుండే చాలా తెలివిగా, సామాజిక స్పృహతో ఉంటూ, అనేక సామాజిక సమస్యలపై గొంతెత్తిన మహిళ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులకు విలాసవంతమైన పార్టీలను ఇచ్చేదట.  ఫ్యాషన్‌కు పెట్టింది పేరైన ఇందిర ఖరీదైన దుస్తులను ధరించేదట. అంతేకాదు ఒకసారి ఆమె వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు  పొదిగిన  100 జతల ఫెర్రాగామో బూట్లు ఆర్డర్ చేసిందట. ఆమె ధరించే సాండిల్స్‌   కూడా చాలా ఖరీదైనవే.

మహారాణి ఇందిరాదేవి విలాసవంతమైన ప్రతిదాన్ని ఇష్టపడేవారట. చరిత్రకారుడు అంగ్మా డే ఝాలా రాసిన ఒక పుస్తకం, రాయల్ ప్యాట్రనేజ్, పవర్, అండ్ ఈస్తటిక్స్ ఇన్ ప్రిన్స్లీ ఇండియా అనే పుస్తకంలో  ఇందిరా దేవికి సంబంధించిన అనేక విశేషాలను పొందుపర్చారు.  మహారాణి ఇందిరా దేవికి పాదరక్షలంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆమె ధరించే బూట్ల బ్రాండ్ చాలా స్పెషల్‌ అనీ, నాణ్యమైన బూట్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ సాల్వటోర్ ఫెర్రాగామోను చాలా ఇష్టపడేదని రాసుకొచ్చారు.

1938లో మహారాణి కెంపులు, వజ్రాలు, పచ్చలతో పొదిగిన కస్టమ్-మేడ్ సాల్వటోర్ ఫెర్రాగామో 100 జతల  ఫెర్రాగామో బూట్లను ఆర్డర్ చేసింది. కప్పబడి ఉంది.  ఇవి  20వ శతాబ్దపు  ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని మ్యూజియో సాల్వటోర్ ఫెర్రాగామోలో ప్రదర్శించారని కూడా తెలిపారు.

చదవండి: Good Health: వెజ్‌ తినాలా? నాన్‌ వెజ్‌ తినాలా?

అందమైన , షిపాన్‌ చీరలు 
షిఫాన్ చీరను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఆమెకు దక్కింది. పారిస్ నుండి 45-అంగుళాల వెడల్పులో నేసిన షిఫాన్ చీరలను ఆర్డర్ చేసేది. ఢిల్లీ , కలకత్తాలో ఆమె కొనుగోలు చీరలను కొనుగోలు చేసిన ఒక ఏడాది తరవాత మాత్రమే ఇతర కస్టమర్లకు అదే నమూనాను తయారు చేయడానికి అనుమతి ఉండేది అంటే ఆమె స్టేటస్‌ను అర్థం చేసుకోవచ్చు.

ఎంగేజ్‌మెంట్‌  క్యాన్సిల్‌   ప్రేమ వివాహం
18 ఏళ్ళ వయసులో మహారాణి ఇందిరా దేవి గ్వాలియర్ మహారాజు మాధో రావు సింధియాతో నిశ్చితార్థం అయింది. 1911లో ఢిల్లీ పర్యటన సందర్భంగా మహారాజు తీరు, ముఖ్యంగా గ్వాలియర్ , బరోడా రాజ కుటుంబాల మధ్య సంబంధాలపై రాజకీయ పరిణామాలు  కారణంగా ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. దీని వల్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా సాహసమైన నిర్ణయం తీసుకుంది.  తరువాత ఆమె అప్పటి కూచ్ బెహార్ మహారాజు తమ్ముడు యువరాజు జితేంద్ర నారాయణ్‌ను  ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఊహించినట్టుగానే ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్న  జితేంద్రతో వివాహాన్ని దీన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు.   కానీ లండన్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో  అతడిని పెళ్లాడింది.

ఇదీ  చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌!

సోదరుడు  మహారాజా రాజేంద్ర నారాయణ్  మరణించిన తర్వాత,  జితేంద్ర కూచ్ బెహార్ మహారాజు అయ్యాడు. ఈ జంట జీవితం సంతోషంగాగడిచింది.కానీ  జితేంద్ర మితిమీరిన మద్యపానం అతని అకాల మరణానికి దారితీసింది.వివాహమైన పదేళ్లకు జితేంద్ర మరణించడంతో  ఐదుగురు పిల్లలతో ఇందిర ఒంటరిదై పోయింది. రాణి ఇందిరా దేవి తన ఐదుగురు పిల్లలతో కూచ్ బెహార్ వ్యవహారాలను నిర్వహించింది.  ఆ కాలంలోనే అన్ని ఆంక్షలను తోసిపుచ్చి  ఇందిర స్వతంత్ర జీవితాన్ని గడిపింది.  ఇంగ్లాండ్ , ఫ్రాన్స్‌లలో  ఉంటూ  హాలీవుడ్ తారలు,  సన్నిహితులతో  లగ్జరీ  పార్టీలతో ఉత్సాహవంతమైన జీవితాన్ని గడిపింది. ఆమె స్వేచ్ఛా జీవితం, తెలివితేటలు, ఆమెకు బలమైన మహిళగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

"అత్యంత అందమైన , ఉత్తేజకరమైన మహిళ అమ్మ. ఆమె తెలివితేటలు ఆమె ప్రేమ, వెచ్చదనం , సున్నితమైన చూపుల అసమానమైన కలయికగా నా జ్ఞాపకంలో ఉంది." తన తల్లి గురించి  ఇందిరా దేవి కుమార్తె మహారాణి గాయత్రీ దేవి  మాటలివి. 1892లో జన్మించిన రాణి ఇందిరా దేవి 1968లో 76 సంవత్సరాల వయసులో మరణించారు.
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)