Breaking News

యువ డిజైనర్లతో ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ భేటీ

Published on Thu, 10/09/2025 - 10:45

హైదరాబాద్‌ నగరంలో డిజైనింగ్‌ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులను పలు ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ప్రతినిధులు బుధవారం కలిశారు. నగరానికి చెందిన ప్రముఖ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హామ్స్‌ టెక్‌ ఆధ్వర్యంలో నాగార్జునహిల్స్‌లో నిర్వహించిన కెరీర్‌ కనెక్ట్‌ కార్యక్రమానికి హాజరైన వందలాది విద్యార్థులకు దేశవ్యాప్తంగా పేరొందిన పలు ఫ్యాషన్‌ బ్రాండ్స్‌కు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 

డిజైనర్లలో సృజనాత్మక శక్తిని, ఇప్పటి వరకూ చేసిన వర్క్స్‌ను బేరీజు వేసుకుని వారికి అవకాశాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ విధానంలో ఇప్పటికే పలువురు విద్యార్థులు అరవింద్‌ ఫ్యాషన్స్, షాపర్స్‌ స్టాప్, లేబొల్‌ ది స్టోరీ, సింఘానియా, ఐశారావు, మై పర్‌ఫెక్ట్‌ ఫిట్‌ తదితర బ్రాండ్లతో కలిసి పనిచేసేందుకు ఎంపికయ్యారని వివరించారు.

పట్నంలో.. గ్రామీణభారత్‌ మహోత్సవం
చేనేత కార్మికులు, హస్తకళ కళాకారులు, ఇతర మహిళా సంఘాలు సృష్టించిన చేనేత–హస్తకళా ఉత్పత్తులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా అమీర్‌పేట్‌లోని కమ్మ సంఘం వేదికగా ఏర్పాటు చేసిన ‘గ్రామీణ భారత్‌ మహోత్సవం’ బుధవారం ప్రారంభమైంది. 

నాబార్డ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గ్రామీణ భారత్‌ మహోత్సవాన్ని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన ప్రారంభించారు. 15వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 21 రాష్ట్రాలకు చెందిన 53 స్టాల్స్‌లో చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. ఇందులో మన రాష్ట్రం నుంచి 14 స్టాల్స్‌ ఉన్నాయి.  

(చదవండి: అంతరిక్ష వేదికపై హైదరాబాద్‌..!)

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)