Breaking News

ఫ్యామిలీ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 విలన్‌ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా?

Published on Fri, 01/31/2025 - 12:37

ది ఫ్యామిలీ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-3లో విలనిజం పండిచబోతున్న నటుడు జైదీప్ అహ్లవత్  ఇపుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా భారీ బరువు నుంచి  బరువును తగ్గించుకుని కండలు తిరిగిన దేహంతో  స్మార్టగా తయారైనాడు.  ఐదు  నెలల్లో 27 కిలోలు తగ్గాడు. దీని కోసం భారీ కసరత్తులే చేశాడు.ఫలితంగా  109.7 కిలోల నుండి 83 కిలోలకు చేరుకున్నాడు.   ఈజీ చిట్కాలు, ట్రెండీ డైట్‌ లాంటివి కాకుండా  27 కిలోల బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నాడు? అహ్లవత్‌ వెయిట్‌లాస్‌ జర్నీని క్రమంలో తెలుసుకుందామా?

బాలీవుడ్‌లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన నటుడు జైదీప్ అహ్లవత్. ముఖ్యంగా పాతాళ్‌ లోక్‌లో హతీ రామ్ చౌదరి పాత్ర ద్వారా బాగా పాపులర్‌ అయ్యాడు.  అలాగే విలన్‌గా  గాకుండా రొమాంటిక్‌ మూవీలు చేయాలని  ఉందనే కోరికనుకూడా  వ్యక్తం చేశాడు. సినిమాల్లో మరింత రాణించాలనే పట్టుదలతో  తనబాడీని అద్భుతంగా తీర్చుదిద్దుకున్నాడు. ఈ వెయిట్‌ టాస్‌ జర్నీ అచంచలమైన క్రమశిక్షణ, ఫిట్‌నెస్ పట్ల అంకితభావం , కఠినమైన ఆహార నియమావళికి నిదర్శనంగా నిలుస్తోంది.ఇందుకోసం అహ్లవత్‌ తీవ్రమైన వ్యాయామాల ద్వారా తన బాడీని మల్చుకున్నాడు.  చీట్ మీల్స్ , చిన్ని చిన్ని వ్యాయామలు లాంటి సాకులు లేకుండా పూర్తి నిబద్ధతతో  తనలక్ష్యంవైపు గురిపెట్టాడు. ఇది తీవ్రమైన బరువు తగ్గడానికి కేలరీలను తగ్గించుకోవడం చాలా అవసరం.  

లాక్‌డౌన్ తర్వాత నే దాదాపు ఒక సంవత్సరం పాటు వ్యాయామం చేయకపోవడంతో చాలా బరువు పెరిపోయానని,  మళ్లీ టోన్డ్‌ బాడీకోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఒకసందర్బంలో తెలిపాడు . తన ట్రైనర్‌ ప్రజ్వల్ దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా  ప్రోత్సాహంతో బరువు తగ్గినట్టు చెప్పాడు. ఈ విశేషాలు ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో షేర్‌ చేశాడు. 2024లో సిద్ధార్థ్‌ మల్హోత్రా  దర్శకత్వంలో వచ్చిన మూవీ మహారాజ్‌ పాత్రకోసం ఈ జర్నీని షురూ చేశాడు.

అహ్లవత్‌  పాటించిన నియమాలు, స్పష్టమైన లక్ష్యాలు
బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, స్పష్టమైన,సాధించగల లక్ష్యాలపై స్పష్టత ఉండాలి. సులువుగా, త్వరగా బరువు తగ్గడం ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కాని వారానికి 0.5 నుండి 1 కిలోలు తగ్గాలనేది గోల్‌ పెట్టుకోవడం ఉత్తమం. ఇది ఎక్కువ కాలం ఈ జర్నీని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది.

కేలరీల లెక్కింపు కంటే పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వండిసరైన పోషకాహారం లేకుండా కేలరీలను తీవ్రంగా తగ్గించడం వల్ల కండరాల నష్టం, పోషక లోపాలు, జీవక్రియ మందగమనం లాంటివి రావచ్చు.కేలరీలను లెక్కించడానికి బదులుగా, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ , సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినాలి.

చాలామంది బరువు తగ్గడానికి కార్డియోపై మాత్రమేదృష్టి పెడతారు. బరువులు ఎత్తడం  కండరాలు, ఎముకలు బలోపేతానికిసహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కోల్పోయిన బరువులో ఎక్కువ భాగం కండరాలు  నష్టపోకుండా  కొవ్వు  కరిగేలా చేస్తుంది. ఫ్యాడ్ డైట్‌లు త్వరగా బరువు తగ్గడానికి దారితీయవచ్చు కానీ , పాటించడం కష్టం,  ఆరోగ్య సమస్యలొస్తాయి. దీనికి బదులుగా, స్థిరమైన, సమతుల్యమైన ఆహార ప్రణాళికను స్వీకరించాలి. క్రమంగా జీవనశైలి మార్పులు దీర్ఘకాలిక విజయానికి దారితీస్తాయి.

హైడ్రేటెడ్‌గా ఉంటూ, ఎలక్ట్రోలైట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.  శరీరానికి తగినన్నినీళ్లు అందించడం వల్ల జీర్ణక్రియకు సహాయ పడుతుంది, ఆకలి అదుపులో ఉంటుంది, మొత్తం జీవక్రియకు సాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా బరువుగా తగ్గినపుడు శరీరం ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది, ఇది అలసట, కండరాల తిమ్మిరి, తలనొప్పికి దారితీస్తుంది.  కనుక శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.

నిద్ర లేమి, అధిక ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారాలపై కోరికలను పెంచుతాయి. ఆకలి, జీవక్రియను నియంత్రించే హార్మోన్లను అంతరాయం కలిగించడం ద్వారా బరువు తగ్గించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. సో..కనీసం 7–9 గంటల నాణ్యమైన నిద్ర ఉండాలి.ఎప్పటికపుడు ఎంత బరువు తగ్గుతున్నాం, బాడీ కొలతలు, ఫోటోలు, బట్టలు  ఇలాంటి పారామీటర్లను చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఇవి విజయానికి ముఖ్యమైన గుర్తులు.  ఒక వేళ అనుకున్నఫలితం రాకపోయినా నిరాశ పడకుండా వ్యాయామ తీవ్రతను సర్దుబాటు చేయడం, ప్రోటీన్‌ ఇన్‌టేక్‌ పెంచడం, లేదా ఇంటర్‌మిటెంట్‌‌ ఉపవాసంపై శ్రద్ధపెట్టాలి. ఇలా కీలక  అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ,  గణనీయమైన బరువును తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.


 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు