Breaking News

Ego అహం పతనానికి నాంది

Published on Thu, 05/22/2025 - 10:37

గర్వం, అహంకారం అన్నవి మహాచెడ్డ దుర్గుణాలు. మానవులకు ఏవిధంగానూ శోభించని లక్షణాలు. నిజానికి ఇవి షైతాన్‌ గుణాలు. కేవలం అహం కారణంగానే దైవానికి అవిధేయుడై దుర్మార్గుల్లో కలిసి   పొయ్యాడు, ధూర్తుడిగా మిగిలి పోయాడు. దైవం మానవుణ్ణి సృష్టించిన తరువాత, అందరూ అతనికి సజ్దా (సాష్టాంగ ప్రణామం) చెయ్యాలని ఆదేశించాడు. కాని షైతాన్‌ చెయ్యలేదు. ఈ విషయం పవిత్ర ఖురాన్‌లో ఇలా ఉంది.: ’ ... ఆ తర్వాత మేము ఆదంకు గౌరవ సూచకంగా అభివాదం చెయ్యండని దైవదూతలను ఆదేశించాము. అప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ అభివాదం చేశారు. ఇబ్లీసు తనేదో గొప్పవాణ్ణన్న అహంకారంతో విర్రవీగుతూ, తిరస్కరించి అవిధేయుడై  పొయ్యాడు.’(2 – 34). అల్‌ ఆరాఫ్‌ సూరా 11, 12 వాక్యాల్లో, సాద్‌ సూరా 73, 74, 75 లో కూడా ఈ ప్రస్తావన ఉంది.

అహం అంటే.., తానే గొప్పవాడినని భావించడం. ఇతరులను తక్కువగా, హీనంగా చూడడం. అన్నీ, అంతా తనకే తెలుసని, ఇతరులకేమీ తెలియదని తల΄ోయడం. షైతాన్‌ ఇక్కడ రెండు తప్పులు చేశాడు. ఒకటి: దైవాదేశాన్ని తిరస్కరించాడు. రెండు: ఆదిమానవుణ్ణి తనకన్నా తక్కువ వాడుగా, నీచుడిగా చూశాడు. అంటే, తన సృజన అగ్నితో జరిగింది కాబట్టి, మట్టితో సృష్టించబడిన వాడికంటే తానే గొప్పవాడినన్న అహం అతడి సత్యతిరస్కారానికి కారణమైంది. ఈ విధంగా వాడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు.

సత్యాన్ని సత్యంగా అంగీకరించాలంటే, ఇతరులను గౌరవ దృష్టితో చూడగలగాలంటే, ’అందరి’ కన్నా గొప్పవాడయిన సృష్టికర్త ఆదేశాలను పాలించగలగాలి. కాని అతనిలోని అహం మరెవ్వరినీ తనకన్నా గొప్పవాడుగా అంగీకరించడానికి ఒప్పుకోదు. సమాజంలో తనకో గొప్పస్థానం ప్రాప్తం కావాలని కోరుకుంటాడు. మరెవరూ తన స్థాయికి, కనీసం తన దరిదాపుల్లోకి రావడాన్నీ సహించలేడు. అంతా తనకే తెలుసునని, ఎదుటివారికి ఏమీ తెలియదని, తనమాటే చెల్లుబాటు కావాలని అభిలషిస్తాడు. ఈ వైఖరి సరయినది కానప్పటికీ, ఎదురు దెబ్బలు తగులుతున్న ప్పటికీ అతనిలోని ’ అహం ’ తప్పుడు వైఖరి గురించి ఆలోచించే అవకాశమే ఇవ్వదు. మంచి అనేది ఉంటే అది తనలోనే ఉందని, ఇతరులు చేరుకోక ముందే తాను దాన్ని అంది పుచ్చుకుంటానని అతను భావిస్తాడు. ఎదుటి వారిలోని ఏమంచినీ, ఏ నైతిక సుగుణాన్నీ అతను అంగీకరించడు. నైతిక వర్తను డైనా, సౌజన్యశీలుడైనా అంతా తానేనని తల΄ోస్తాడు.

చదవండి: Ashtavakra అష్టావక్ర సందేశం

ఇలాంటివారు తమ అహంకార వైఖరి కారణంగా తమను తామే నష్టపరుచుకుంటారు తప్ప మరొకటి కాదు. ఇదంతా తమకే అంతా తెలుసు, ఎదుటి వారికి ఏమీ తెలియదనుకున్న ఫలితం. వారి మనసులో తామేదో గొప్పవాళ్ళమన్న అహంకార భావం తిష్ట వేసుకొని ఉంటుంది. ఇది ఎంతమాత్రం మంచి విధానంకాదు. గర్వం, అహంకారం లాంటి దుర్లక్షణాల నుండి దైవం అందరినీ 
కాపాడాలని కోరుకుందాం.

ఇదీ చదవండి: ఎవడు వివేకి? ఎవడు అవివేకి?

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్