ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్
Breaking News
అక్కడ మగవాళ్లు చీరలు ధరించి గర్బా నృత్యం..! 200 ఏళ్ల నుంచి ఇప్పటికీ..
Published on Tue, 10/20/2026 - 12:51
గుజరాత్లో నవరాత్రి వేడకలు గర్బా నృత్యాలతో కోలాహలంగా ఉంటాయి. కానీ అహ్మదాబాద్‌లోని షాహ్పూర్ మాత్రం ఇందుకు అత్యంత విభిన్నం. పురుషులు, స్త్రీలు అనే తారతమ్యం లేకుండా అందరు గర్బా నృత్యంలో పాల్గొంటారు. కానీ ఇక్కడ మాత్రం మగవాళ్లు స్త్రీల వేషధారణలో గర్బా నృత్యం ఆడటం విశేషం. ఇలా ఎందుకు చేస్తున్నారు?, ఈ ఆచారం వెనుక ఉద్దేశ్యం ఏంటి అంటే..
దేవినవరాత్రులు ఒక్కోచోట ఒక్కో ఆచార వ్యవహారాలను పాటిస్తారు. కానీ అహ్మదాబాద్ మాత్రం ప్రాయశ్చిత్తం, క్షమాపణలsy అమ్మవారి వేడుకలు నిర్వహించడం విశేషం. ఇక్కడ మగవాళ్లు నవారాత్రుల్లోని ఎనిమిదవ రోజు మగవాళ్లు స్త్రీల వేషధారణలో గర్బా నృత్యం చేస్తారు. చిన్న పిల్లవాడి నుంచి అందరు చీరలు ధరించి ఈ గర్బా నృత్యంలో పాల్గొంటారు. ఈ ఆచారాన్ని 200 ఏళ్ల నాటి నుంచి పాటిస్తుండటం విశేషం. ఇంతకీ ఎందుకిలా అంటే..
ఆచారం వెనుకున్న కథ..
సుమారు 200 ఏళ్ల క్రితం 1872లో బరోట్ వంశానికి చెందిన సాధుమాత అత్యంత అందమైన మహిళ ఉండేది. ఆమె అందానికి మోహవశుడే అప్పటి పాలకుడు ఆమెను బలవంతంగా తీసుకురమ్మని సైనికులకు ఆదేశాలు పంపాడు. బరోట్ సమాజ సభ్యులు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను పంపించేందుకు ఇష్టపడకపోవడంతో. పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చూస్తుండగానే అది కాస్తా తీవ్ర రూపం దాల్చింది. అది చూసి అందాల బొమ్మ తల్లిదండ్రలు కోపోద్రేకులై..ఇంత వినాశం కంటే తమ కూతురే చనిపోతే మంచిదని భావించారు.
దాంతో ఆమె తల్లి మనసు రాయి చేసుకుని తన భర్తను పిలిచి ఒక్కవేటుతో కూతురుని హతమార్చమని చెబుతోంది. అలా సాధుమాత కన్నతల్లిదండ్రుల చేతుల్లోనే చనిపోతుంది. ఆనాటి నుంచి తమ కళ్లముందే పెరిగిన ఆమెను కాపాడుకోలేకపోయమనే బాధ బరోట్ వాసులను వెంటాడింది. అదీగాక ఆ అందాలరాశీ మరణానంతరం అక్కడ మగవాళ్లు, మగపిల్లలు చిన్న వయసులనే అకాలంగా మరణించడం ఎక్కువై వంశం క్షీణించిపోవడం ప్రారంభమైంది.
ఆ సౌందర్యవతి శాపమే వెన్నాడుతుందని భావించారు అక్కడి ప్రజలు. దాంతో సాధుమాత గౌరవార్థం స్థాపించిన ‘సాదు మాత ని పోల్’ ఆలయ ప్రాంగణం వద్ద పురుషులంతా మగవాళ్ల అలంకరణలో గర్భా నృత్యం చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి మగవాళ్ల అకాల మరణాలు తగ్గిపోయాయి. దాంతో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకల్లో ఎనిమిదో రోజున ఇలా సాదు మాత ని పోల్ స్త్రీల వేషధారణలో మగవాళ్లు గర్బా నృత్యం చేయడం ప్రారంభించారు.
ఇది ఒకరకంగా ప్రాయశ్చిత్తం, క్షమాపణలు కోరుతూ చేసే ఆచారం. ఈ ఆచారం వెనుక స్త్రీల రక్షణను గుర్తు చేయడమే గాక, త్యాగం, క్షమాపణల విలువలను తెలియజేసే సంప్రదాయంగా చెప్పొచ్చు. విచిత్రం ఏంటంటే తరతరాలుగా అక్కడ బరోట్ వాసులు పాటించడం విశేషం. చదువుకుని వేరేప్రాంతాల్లో స్థిరపడినా..ఈ వేడుకు జరిగే సమయానికి తమ ప్రాంతానికి చేరుకుని ఈ సంప్రదాయన్ని పాటిస్తుంటారట.
ఇదీ చదవండి: నవరాత్రుల సమయంలోనే తెరుచుకునే అమ్మవారి ఆలయం..! రక్షగా నాగుపాము..
Tags : 1