Breaking News

ఢిల్లీలో జరిగే రామ్‌లీలా నాటకంలో పరశురాముడిగా బీజేపీ ఎంపీ

Published on Sun, 09/21/2025 - 12:54

ఢిల్లీలో ప్రతి ఏటా రామ్‌లీలా నాటక ప్రదర్శన ఎంతో వైభోవపేతంగా జరుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఈ నాటకంలో ప్రముఖులు, సెలబ్రిటీలు, నటులు ఇందులో తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అదరమో అని బిరుదుల అందుకుంటుంటుంది. ఈసారి కూడా అలానే నటులు, గాయకులతోపాటు రాజకీయ నాయకులు కూడా పాల్లొనడం విశేషం. ఈ ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో రామ్‌లీలకు సంబంధించిన లవ్‌కుశ అనే నాటికను ప్రదర్శించనున్నారు. 

అందులోని పరుశురాముడి పాత్రలో బీజేపీ ఎంపీ , భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ నటించనున్నారు. విఘ్ణువు ఆరవ అవతారంగా భావించి పరుశురాముడిలా ఒదిగిపోనున్నారు ఎంపీ తివారీ. ఆయన గతేడాది కూడా ఇదే పాత్రలో ఒదిగిపోయి ప్రశంసలందుకున్నారు. పౌరాణిక పురాణాల ప్రకారం పరుశురాముడు కలియుగం చివరిలో కల్కి గురువుగా కనిపిస్తాడని చెబుతుంటారు. ఇక రాముడి పాత్రలో నటుడు కిన్షుక్‌ వైద్య, నటుడు ఆర్య రావణుడి పాత్రను పోషిస్తున్నారు. అలాగే గాయకుడు శంకర్‌ సాహ్నే గతేడాది పోషించిన పాత్రలోనే ఒదిగిపోనున్నారు.  

రామ్‌లీలా నాటక విశిష్టత..
యునెస్కో జాబితాలో కూడా ఈ రామలీలా నాటకం చోటుదక్కించుకుంది. యునెస్కో ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్ వెబ్‌సైట్ ప్రకారం..అక్షరాల రామాయణ ఇతిహాసానికి సంబంధించిన రాముడి నాటిక ఇది. ఇందులో కథనం, పారాయణం, సంభాషణలు ఉంటాయి. ఇది ఉత్తర భారతదేశం అంతటా దసరా పండుగ సందర్భంగా ప్రదర్శించడం జరుగుతుంది. 

ప్రతి ఏడాది శరదృతువులో ఈ నాటకంను ప్రదర్శిస్తారు. దీన్ని తులసీదాస్‌ విరచిత రామచరిత మానస్‌ ఆధారంగా రూపొందిస్తారు. ఇక ప్రపంచంలోనే అతి పురాతనమైన రామ్‌లీల నాటిక వారణాసిలోని చిత్రకూట్‌ రామ్‌లీల ప్రదర్శితమవుతోంది. ఇక్కడ ఇది సుమారు 485 సంవత్సరాల క్రితం నుంచి ప్రదర్శిస్తున్నారట.

(చదవండి: బలాన్నిచ్చే బతుకమ్మ ఫలహారం)


 

 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)