Breaking News

దుబాయ్‌లో వర్షం ఎలా పడుతుందో తెలుసా..!

Published on Mon, 04/08/2024 - 16:19

భారత్‌లో వర్షం కోసం మనం ఎదురూ చూడాల్సిన పరిస్థితి ఉండదు. కాలానుగుణంగా వర్షాలు పడుతూనే ఉంటాయి. మన దేశంలో కూడా కొన్ని వానలు కురవని ప్రాంతాలు ఉన్నాయి. అయితే మరీ అస్సలు పడకుండా మాత్రం ఉండదు.  అయితే దుబాయ్‌లాంటి అరబ్‌ దేశాల్లో అస్సలు వర్షాలూ పడవనే విషయం ఎంతమందికి తెలుసు. అక్కడ ఏడాదంతా వేడి వాతావరణంతో పొడిపొడిగా ఉంటుందట. నీటి సమస్య కూడా ఎక్కువే. మరి అలాంటి ప్రదేశాల్లో వర్షం లేకపోవడం కారణంగా వ్యవసాయాధారిత పంటలు కూడా ఏమి ఉండవు. అందుకని వర్షం పడేలా వాళ్లు  ఏం చేస్తారో తెలుసా..!

ఆయా దేశాల్లో వర్షాలు పడకపోవడంతో కృత్రిమ వర్షం సృష్టిస్తారు. దీన్ని క్లౌడ్‌ సీడింగ్‌ అని పిలుస్తారు. వర్షం లేదా మంచు ఏర్పడటాన్ని ప్రోత్సహించడానికి పదార్థాలను గాలిలోకి వెదజల్లి వర్షం పడేలా చేస్తారు. ఈ విధానంలో సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లేదా డ్రై ఐస్ వంటి పదార్థాలతో మేఘాలను విత్తడం జరుగుతుంది. ఇవి నీటి బిందువులు చుట్టూ ఏర్పడటానికి కేంద్రకాలుగా పనిచేస్తాయి.

ఈ కణాలకు తేమను ఆకర్షించే గుణం ఉండటం వల్ల  పెద్దగా వర్షంలా పడేందుకు దారితీస్తాయి. ఈ పద్ధతి వర్షం లేదా మంచును ఉత్పత్తి చేయని మేఘాలలో వర్షపాతాన్ని ప్రేరేపిస్తాయి. అయితే దీన్ని దశాబ్దాలుగా ప్రయోగం చేస్తున్నప్పటికీ.. వాతారణ పరిస్థితులు, కారకాల కారణంగా ఒక్కోసారి ప్రభావం మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా ఈ విధానంలోనే వర్షం పడేలా చేస్తుంది. అక్కడ అధికారులు నీటి కొరత సవాళ్లను పరిష్కరించేందుకు ఈ వ్యూహాత్మక విధానాన్ని ఉపయోగిస్తుంటోంది. ఈ క్లౌడ్‌ సీడింగ్‌ టెక్నాలజీని ఎక్కువగా పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతాల్లోనే ఉపయోగిస్తారు. అక్కడ తీవ్రమైన వేడి వాతావరణం దృష్ట్యా నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించేందుకు యూఏఈ శాస్త్రవేత్తలు ఈ క్లౌడ్‌ సీడింగ్‌ అనే టెక్నాలజీని ఉపయోగించారు.

అందుకోసం వారు దేశ వాతావరణంపై చాలా అప్రమత్తమైన నిఘా ఉంచుతారు. ఈ క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతితో పొడి వాతావరణ పరిస్థితుల్లో 30% నుంచి 35%, ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో 10% నుంచి 15% వరకు వర్షపాతాన్ని పెంచగలవని శాస్త్రవేత్తల చెబుతున్నారు. ఈ పద్ధతిలోనే దుబాయ్‌లో వర్షం పడేలా చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: యుద్ధ భయంతో పడవ ఎక్కితే..నడి సంద్రంలో ఇంజన్‌ ఫెయిల్‌..!)

#

Tags : 1

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)