Breaking News

ఆరు నెలల్లో 12 కిలోలు బరువు తగ్గిన మహిళ..!

Published on Mon, 02/23/2026 - 13:01

బరువు తగ్గడం అంత ఈజీ కాకపోయినా..అసాధ్యం మాత్రం కాదు. అదనపు బరువుని తగ్గించుకోవడానికి ఇక్కడొక మహిళ అనుసరించిన విధానం..అందర్నీ కదిలిస్తోంది, ప్రేరేపిస్తోంది కూడా. కేవలం ఆరు నెలల్లోనే మంచి ఫలితాన్ని అందుకుంది. పైగా అందుకోసం ఆమె ఎంతలా కష్టపడిందో తెలిస్తే..విస్తుపోతారు. మంచి శీరారకృతి, ఆరోగ్యకరమైన బరువు కోసం ఆ మాత్రం డెడికేషన్‌ ఉండాల్సిందే మరి. ఇక్కడ ఈ మహిళ బరువు తగ్గడం కోసం ఏం అనుసరించిందంటే..

దుబాయ్‌కి చెందిన షెర్రీ పీటర్‌ అనే మహిళ తాను ఆరు నెలల్లో 12 కిలోలుకు పైగా బరువు తగ్గానని సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా పేర్కొంది. అంతేగాదు ఆగస్టు 2025 vs ఫిబ్రవరి 2026 కల్లా 12 కిలోలు తగ్గి..స్లిమ్‌గా మారాను అని పోస్ట్‌లో తెలిపింది. మంచి శరీరాకృతి కోసం అనుసరించిన వెయిట్‌లాస్‌ వ్యూహం గురించి పేర్కొన్నారామె.

ప్రతిరోజూ పదివేల అడుగులు
రోజువారీగా పదివేల అడుగుల వాకింగ్‌. ఇది బరువు తగ్గడానికి ఒక ప్రభావవంతమైన వ్యూహం. దీనివల్ల రోజుకు దాదాపు 300–500 అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. తాను దీన్ని ఒక ఏడాది నుంచి పాటిస్తున్నానని చెప్పారు. జిమ్‌కి వెళ్లడానికంటే మందు నుంచి ప్రారంభించానని చెప్పారు. 

వారంలో నాలుగు రోజులు..బరువులు ఎత్తడం, పైలేట్స్ 
వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్‌ను వారానికి నాలుగు నుంచి ఐదు రోజులు కేటాయించానని తెలిపింది. వాటిలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జీవక్రియను పెంచగా, పైలేట్స్‌ కోర్‌ బలాన్ని పెంపొందిస్తాయి. 

ఎమ్స్‌కల్ప్ట్ నియో వారానికి రెండుసార్లు
ఎమ్స్‌కల్ప్ట్ నియో అనే మిషన్‌ సాయంంతో శరీర ఆకృతి చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఏకకాలంలో కొవ్వును కరిగింఇచ 30 నిమిషాల సెషన్‌లలో కండరాలను నిర్మిస్తుంది. ఇది ఉదరం, పిరుదులు, చేతులు,  తొడలపై ప్రభావవంతంగా ఉంటుంది.

ఆహారం
సమర్థవంతమైన బరువు తగ్గడంలో అధిక ఫైబర్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి సారించడం అత్యంత కీలకం. అలాగే హైడ్రేటెడ్‌గా ఉంటూనే చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ వినియోగాన్ని కూడా పరిమితం చేయాలి. అదనంగా తినాలనిపించినప్పుడల్లా.. తీసుకున్న గ్రీన్ టీ కాస్త భావోద్వేగ మద్దతుగా మారిందని షెర్రీ చెప్పింది.

మద్యం మానేయడం
క్యాలరీ తీసుకోవడం తగ్గించడానికి ఆల్కహాల్ తగ్గించడం అనేది చాలా ప్రభావవంతమైన మార్గం. సాధారణంగా ప్రతి పెగ్‌ ఆల్కహాల్‌ వంద కేలరీనలు పెంచుతుంది. అందుకే పూర్తిగా మానేసి పైలేట్స్‌, జిమ్‌, వాకింగ్‌లపై ఫోకస్‌ పెట్టినట్లు తెలిపారామె.

సింపుల్‌గా చెప్పాలంటే..ఎక్కువ నడవడం, తక్కువ తినడం బరువు తగ్గడానికి సరళమైన మార్గం అని అందరికీ తెలుసు. కానీ ఇలా షెర్రీ లాంటి మహిళల అనుభవపూర్వకమైన వెయిట్‌లస్‌ స్టోరీలు..ఇలాంటి వాటిని అనుసరించేలా చేయడంలో ప్రేరణటీ ఉంటాయి కదూ..!. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.

 

(చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్‌ వెల్నెస్‌ సీక్రెట్‌..! ఆయిల్‌ మసాజ్‌లు, ఇంట్లో తయారు చేసే..)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)