Breaking News

రూ.13 వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?

Published on Sat, 08/16/2025 - 17:26

యాడ్-టెక్ కంపెనీ అయిన యాప్ నెక్సస్ (AppNexus) కో ఫౌండర్, మాజీ సీఈఓ  బ్రియాన్ ఓ కెల్లీ (Brian O'Kelley)  భారీ విరాళాన్ని ప్రకటించారు.  2018లో తన కంపెనీ విక్రయం ద్వారా వచ్చిన 1.6 బిలియన్ల డాలర్ల ఆదాయంలో (రూ. 14,036.64 కోట్లు)ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇచ్చేశానని వెల్లడించారు. ప్రపంచమంతా కోట్లకు పడగలెత్తాలని, రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్లుగా, బిలియనీర్లుగా ఎదగాలని కలలుకంటోంటే.. ఈయన మాత్రం తనకు బిలియనీర్ల మీద పెద్దగా మోజులేదని చెప్పుకురావడం విశేషం.

ఫార్చ్యూన్ మ్యాగజైన్  వివరాల ప్రకారం.. 2018లో తన కంపెనీని అమ్మడం ద్వారా 1.6 బిలియన్ డాలర్ల సంపాదన వచ్చింది. అందులో ఎక్కువ భాగాన్నిఛారిటీకి ఇచ్చేశారు. కంపెనీలో 10 శాతం వాటా ఉన్న బ్రియాన్ ఓ కెల్లీ తన కుటుంబం కోసంకేవలం  100 మిలియన్ డాలర్ల  సంపాదన ఉంచుకున్నట్లు తెలిపారు.  ఇది పోగా దాదాపు 13 వేల కోట్లను  ఛారిటీకిచ్చేశారు.  తన భార్యతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కుటుంబ అవసరాలకు ఎంత డబ్బు కావాలో తన సలహా మేరకే నిర్ణయం తీసుకున్నామని  తెలిపారు. 

చదవండి: గ్రాండ్‌మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గా

అంతేకాదు తాను బిలియనీర్లను నమ్మననీ, ఇది రెడిక్యులస్‌గా అనిపిస్తుందనీ అందుకే తన పిల్లలు కూడా పరిమితులు తెలుసుకుని, విలువలతో కూడిన  జీవితాన్ని గడపాలనేదే తనఉద్దేశమని చెప్పుకొచ్చారు. వారికి విలాసవంతమైన జీవితం ఇవ్వాలను తాను అస్సలు భావించలేదన్నారు.న్న నిజమైన సంపద జవాబుదారీతనంతో రావాలని,ఆర్థిక సరిహద్దులతో జీవించడం ప్రజలను నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉంచుతుందంటా రాయాన.

ఇదీ చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్‌ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీ


 

ప్రస్తుతం సప్లయ్‌ ఉద్గారాలను ట్రాక్ చేయడంపై దృష్టి సారించిన కొత్త స్టార్టప్, స్కోప్3కి నాయకత్వం వహిస్తున్న ఓ'కెల్లీ, తన తదుపరి వెంచర్ విజయవంతమైనా, తనకు  బిలియనీర్ అయ్యే ప్రణాళికలు లేవనిప్రకటించడం గమనార్హం.
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)