Breaking News

తండ్రి కల కోసం..ఆమె 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా!

Published on Sun, 11/01/2026 - 17:03

50 ప్లస్‌ అనగానే కాస్త చేయగలిగే పనులే చేస్తుంటారు. చాలామటుకు రెస్ట్‌ తీసుకునే వయసులో రిస్క్‌ చేయడానికి ఆసక్తి చూపరు. అయితే ఆ మహిళ మాత్రం తండ్రి కల కోసం పురుషాధిక్యత ఉన్న రంగంలోకి వచ్చింది. కష్టాలు, సవాళ్లు ఎదురైనా.. వెనుదిరగలేదు. తన తండ్రి ఈ భూమ్మీద లేకపోయినా..ఆయనికిచ్చిన మాట కోసం ఆ మహిళ కట్టుబడి ఉండటమే గాక స్త్రీ శక్తికి నిర్వచనంగా మారింది. 

ఆ ధీర వనితే డాలీరాణా. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో నివశిస్తున్న రాణా భుజానికి టికెట్ల సంచిని తగిలించుకుని ప్రయాణికులకు బస్టాప్‌లు తెలియజేస్తుంటుంది. చూసేవాళ్లకు అది సాధారణ బస్‌ కండక్టర్‌ ఉద్యోగమే అయినా..అది ఆమె తండ్రి ఆశయం..ఏళ్లనాటి జ్ఞాపకాల కల. ఆమె తండ్రికి రవాణా రంగంలో పనిచేయాలని కోరిక ప్రబలంగా ఉండేది. 

తనకు సొంతంగా బస్సు ఉండాలని అనుకునేవారు. ఆ కల నెరవేరకుండానే ఆయన చనిపోయారు. ఆయన కలను నిజం చేయాలని రాణా అప్పులు చేసి మరి 2017లో ఒక బస్సు కొనుగోలు చేసింది. మొదట్లో డ్రైవర్‌ను, కండక్టర్‌ను నియమిచుకుని వ్యాపారాన్ని పర్యవేక్షించిందామె. కేవలం తన తండ్రి కల, ఆశయం కోసం అంతపెద్ద ఆర్థిక బాధ్యతను తన భుజాలపై వేసుకుని మరి నిర్వర్తించింది. అంతలో కరోనా మహమ్మారి రావడంతో రవాణా రంగంలో చాలా వ్యాపారాల మాదిరిగానే ఆమె వ్యాపారం కూడా తీవ్రంగా దెబ్బతింది. 

2021లో సరిగ్గా తన బస్సు కండక్టర్‌ ఉద్యోగం వదిలి వెళ్లిపోయాడు. దాంతో నష్టాలు, కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అప్పుడు రాణా వద్ద రెండే రెండు మార్గాలున్నాయి. వ్యాపారాన్ని వదిలేయడమో లేదా కొనసాగించడమో తప్ప మరో మార్గం లేదు. అయితే రాణా కొనసాగించేందుకు మొగ్గు చూపి..అలా 54 ఏళ్ల వయసులో కండక్టర్‌గా మారిందామె. ఆమె నేరుగా విధుల్లోకి వెళ్లి పని నేర్చుకుంది. రద్దీగా ఉండే బస్సులో ఎక్కడం, దిగడం, టికెట్లు జారీ చేయడం, ఏదైనా గొడవ జరిగినప్పుడు జోక్యం చేసుకోవడం వంటివి చేస్తుండేది. 

అయితే ప్రయాణికులు చాలామంది ఈ పని ఏంటని ప్రశ్నిస్తుంటారు. ఎందుకంటే ఒక మహిళగా ప్రైవేట్‌ బస్సులో కండక్టర్‌ ఉద్యోగం చేయడం కష్టమే, పైగా వేధింపులు కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ ప్రతి ఉదయం విధులకు హాజరవుతూనే కండక్టర్‌గా కొనసాగుతూనే ఉంది. ఆమె బస్సు బెల్గాచియా, హౌరా మధ్య నడుస్తుంది. ప్రయాణికులు ఆమెను ముద్దుగా డాల్‌ దీ అనిపిలుస్తారు. ఆ బస్సు ఆమెకు జీవనాధారం, భారం కూడా అయ్యింది. ఎందుకంటే నిర్వహణ ఖర్చులు, మరమ్మతులు ఖరీదైనవిగా మారి రుణ చెల్లింపులు ఒత్తిడిని పెంచింది. 

అదే సమయంలో ఎలక్ట్రిక్‌ ఈ రిక్షాల పెరుగుదల కూడా ఆమె ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపాయి కూడా. అయితే రాణాకి బస్సుని వదులుకోవడం అంటే జీవనాధారం కోల్పోవడం మాత్రమే కాదు..తనకు ప్రాణమైన తండ్రి కలను కూడా వదులకోవడం కింద లెక్క. అందుకే ఆమె వ్యాపారాన్ని మళ్లీ లాభదాయకంగా మార్చుకోవడం కోసం కొత్త రూట్‌ పర్మిషన్‌ కోసం ఎదురుచూస్తోంది. అయితే ఆమె కథ నెట్టింట వైరల్‌ అవడంతో ఏకంగా ఆ రాష్ట్ర రవాణ యంత్రంగమే కదిలొచ్చి కొత్త రూట్‌ కోసం ఆమె చేసిన అభ్యర్థనను ఆమోదించింది. 

ఈ అవకాశం ఆమెకు ఈ రిక్షాల పోటీని ఎదుర్కొనేందుకు దొరికిన గోల్డెన్‌ ఛాన్స్‌. అంతేగాదు రాణా ఇది తనకు పెద్ద ఊరటనిచ్చే విజయం అని ఆనందంగా చెబుతోంది. ఇక్కడ ఆమె కథ మహిళ బస్‌ కండక్టర్‌ కావడం వల్ల సన్సెషన్‌ కాదు..తండ్రి కల కోసం ఒక కుమార్తె ఆ వయసులో రిస్క్‌ తీసుకోవడమే కాకుండా ఒక మగాడిలా కండక్టర్‌గా ఒక ప్రైవేటు బస్సులో విధుల నిర్వర్తించడం, బస్సుని నిర్వహించడం మాటలు కాదు. పైగా ఆడవాళ్లు బలహీనులు అన్న మాటను తిరగరాసేలా స్ఫూర్తినిస్తుంది రాణా కథ.

 

ఇదీ చదవండి: రీడింగ్ ఛాలెంజ్‌లో సంచలనం..60 పుస్తకాలు చదివి కోట్లు గడించిన చిన్నారి!

 

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)