Breaking News

Black Salt Benefits : బ్లాక్‌ సాల్ట్‌తో ఇన్ని లాభాలా?

Published on Fri, 05/03/2024 - 12:56

కోవిడ్‌-19 సంక్షోభం తరువాతఅందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి బ్లాక్‌ సాల్ట్‌ లేదా నల్ల ఉప్పు. నల్ల ఉప్పుతో ఎలాంటి ప్రయోజ నాలున్నాయో  తెలుసుకుందాం

ఉప్పులేని వంటిల్లు  లేదు.  కానీ మనం రెగ్యులర్‌గా వాడే తెల్ల ఉప్పుతో కంటే కూడా  బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగిన బ్లాక్‌సాల్ట్‌ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో సహాయపడే ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది.  

అలాగే నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియదు.

ఎసిడిటీ, మెరుగైన జీర్ణక్రియ 
తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి  నల్ల ఉప్పు నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.  

నల్ల ఉప్పును సరైన పరిమాణంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచుతుంది. ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి.

గుండె ఆరోగ్యానికి 
చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితిమీరి ఎలాంటిది తీసుకున్నా హానికరం కాబట్టి, దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

బరువు తగ్గడానికి
నల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది.సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే మంచిది.

నోటి ఆరోగ్యం 
గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి నిద్రించే ముందు పుక్కిలిస్తే దంతాలు బలపడతాయి. దీంతో పంటి నొప్పి, కుహరం సమస్యలు కూడా నయం అవుతాయి.  చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యను కూడా వదిలించుకోవచ్చు.

చర్మ సమస్యలు 
నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిది. సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు.
 

 నోట్‌: ఇది కేవలం సమాచారంగా మాత్రమే అని గమనించగలరు.  బీపీ రోగులు ఉప్పును ఎంత పరిమితంగా వాడితే అంత మంచిది. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)