Breaking News

నల్ల జామపండ్ల గురించి మీకు తెలసా? వీటిని తినడం వల్ల..

Published on Mon, 07/10/2023 - 16:14

పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ప్రతిరోజూ పండ్లను తినడం వల్ల అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు. అలాంటి పండ్లలో జామపండ్లు కూడా ఒకటి. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకు జామపండ్లను ఇష్టంగా తింటుంటారు. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే జామాపండ్లు గురించి అందరికి తెలుసు..

కానీ నల్ల జామకాయల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సాధారణ జామ పండుతో పోలిస్తే ఈ నల్ల జామ పండులో పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఇప్పుడు తెలుసుకుందాం..

► నల్ల జామపండ్లు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. శరీరానికి కూడా ఇవి చాలా మంచివి.


► ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి వంటివి ఇందులో అధికంగా ఉంటాయి. 
► నల్ల జామపండ్లను తరచూ తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 


► అంతేకాకుండా వీటిని తరచూ తినడం వల్ల మలబద్దకం, పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది.
► రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ నల్ల జామపండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 


► నల్ల జామకాయ‌ల‌ను తినడం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీనివల్ల త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్‌ల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు.
► యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉండటంతో వృద్ధాప్యాన్ని నివారించటంలో నల్ల జామకాయలు  సహాయపడతాయి.
► నల్లజామకాయలు తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్ల జామకాయలు తినాలంటే మాత్రం ఇండియలో దొరకవు. ఈ పండ్లు ఎక్కువగా బ్రెజిల్‌, సౌత్‌ అమెరికాలో ఎక్కువగా దొరుకుతాయి. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు