Breaking News

Inspiration దశరథుడి మంత్రి మండలి

Published on Mon, 05/05/2025 - 10:39

రాచరికాలు నడిచిన ప్రాచీన కాలంలో కూడా సమర్థులైన పాలకులెవరూ నిరంకుశులుగా, నియంతలుగా, కేవలం తమ ఇచ్చ వచ్చినట్టు పరిపాలించటం ఉండేది కాదు. మన పురాణేతిహాసాలలో ప్రసిద్ధులైన రాజులందరూ, రాజ్య పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలను, మేధావులయిన తమ మంత్రుల బృందాలతోనూ, ఇతర నిపుణులతోనూ, అవసరమయితే పౌర ప్రముఖులతోనూ, సామంతులతోనూ, జానపదులతోనూ విస్తృతంగా చర్చించిన తరవాతే తీసుకొనేవాళ్ళని కనిపిస్తుంది. అల్పబుద్ధులూ, ఆసురీ స్వభావులు మాత్రమే అధికార మదాంధకారంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా, నిరంకుశంగా, ఇష్టారాజ్యంగా పాలించి, అందరినీ అవస్థలు పెట్టి, అపయశస్సు కూడగట్టుకొని, ఆయువు తీరగానే కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు.

దశరథుడు అరవయి వేల సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన చేశాడని రామాయణం చెబుతుంది. ఏ కీలక నిర్ణయమైనా, ఆయన సంబంధితులందరితో విస్తృతంగా చర్చించిగానీ తీసుకొనేవాడు కాదు అని వాల్మీకి వక్కాణించాడు. దశరథుడికి ఒక సమర్థమైన మంత్రిమండలి ఉండేది. వాళ్ళలో ప్రధానమైన మంత్రులు ఎనిమిది మంది: ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళుగాక, దశరథుడికి వసిష్ఠుడు, వామదేవుడు ముఖ్య పురోహితులుగా, ధర్మ నిర్దేశకులుగా, గురువులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ నేపథ్యం గురించి ఎంతో పరిశోధన జరిపించిన తరవాతే, దశ రథుడు తన మంత్రులను నియమించుకొనేవాడు. వాళ్ళు ఎన్నో పరీక్షలు నెగ్గవలసి ఉండేది. అందుకే ఆ మంత్రులందరూ పరువు ప్రతిష్ఠలు కలవారుగా, సంస్కా రులుగా, శాస్త్ర జ్ఞాన నిష్ణాతులుగా ఉండేవారు. వాళ్ళు కుశాగ్ర బుద్ధులు, విద్యావంతులు, లోకజ్ఞులు, నీతి వేత్తలు. ఎప్పుడూ రాజు శ్రేయస్సునూ, రాజ్య శ్రేయస్సునూ కాంక్షించే నిస్వార్థపరులు, నిజాయతీపరులు. అపరాధులయితే, సొంత పుత్రుల నయినా నియమానుసారం దండించే నిష్పక్షపాతులు. ఇంతటి నిపుణులతో, నీతిమంతులతో, ధర్మజ్ఞులతో అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించిన తరవాతే అన్ని ముఖ్యమైన నిర్ణయాలూ తీసుకోవటం జరిగేది. కనకనే దశరథుడి సుదీర్ఘ పాలనలో ప్రజలంతా ధర్మమార్గంలో తృప్తిగా, సుఖశాంతులతో జీవించారు అని వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది.
– ఎం. మారుతి శాస్త్రి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)