Breaking News

ఆరడుగుల స్థలంలో ‘బుర్జ్‌ ఖలీఫా​‍: దుబాయ్‌లో కాదు.. మరెక్కడ?

Published on Wed, 01/31/2024 - 12:20

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అనగానే దుబాయ్‌లోని  బుర్జ్ ఖలీఫా  గుర్తొస్తుంది ఎవరికైనా.  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో సహా ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. వాస్తవానికి   నిర్మాణ శైలికి, ఇంజినీరింగ్ సామర్థ్యానికి ప్రతిబింబంగా నిలిచే భవానాలకు నిలయం దుబాయ్‌. నగరంలోని సుదూర ప్రాంతాలనుంచి  కూడా  160-అంతస్తుల టవర్‌ను ఈజీగా గుర్తు పట్టేయొచ్చు. మన దేశంలో కూడా బుర్జ్‌ ఖలీఫా అంటూ ఒక వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు  కొడుతోంది.  అదే బిహార్  బుర్జ్ ఖలీఫా.   మరి ఈ  ఇంట్రస్టింగ్‌  వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని గన్నిపూర్ ప్రాంతంలో ఉంది ఈ భవనం. కేవలం ఆరడుగుల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించడం విశేషం. అంతేకాదు ఇంటి వెడల్పు కూడా ఐదు అడుగుల మాత్రమే.

క్యాండీమేన్‌ వ్లాగర్‌ ప్రకారం స్థానికులు ముచ్చటగా దీన్ని ఈఫిల్ టవర్ అని పిలుస్తుంటారట. అంతేకాదు 2015లో సంతోష్ అనే వ్యక్తి తన భార్యకు బహుమతిగా దీన్ని నిర్మించాడట. అందుకే దీన్ని ఐకానిక్ తాజ్ మహల్‌తో పోల్చాడు. పెళ్లి తరువాత భార్యతో కలిసి ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడు. కానీ ఇంత తక్కువ ప్లేస్‌లో ఎక్కువ సౌకర్యాలతో భవనం  నిర్మించాలనే  ఆలోచనతో  సంతోష్ ఓ ఇంజినీర్‌ను కలిసాడు. ఫలితంగా అద్భుతమై భవనాన్ని డిజైన్‌ చేసి ఇచ్చాడు ఇంజినీర్.

సమీప గ్రామాల  ప్రజలు ఈ భవనాన్ని చూసేందుకు తరచూ వస్తుంటారట. దీంతో ఇది టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారిపోయిందంటూ ఈ భవనం విశేషాలు పంచుకున్నాడు  ఈ వీడియోలో.  ఇక దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇల్లు చాలా తక్కువ స్థలం ఉన్నప్పటికీ, వంటగది, బాత్రూమ్  పడకగదితో సహా అన్ని సౌకర్యాలను కలిగి ఉండే విధంగా దీన్ని నిర్మించారు. ఇది రెండు భాగాలుగా ఇంటి మొదటి భాగంలో మెట్లు , రెండో భాగంలో గదులు ఉంటాయి. ప్రస్తుతం ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చారు. కానీ దీని స్పెషల్‌ లుక్‌ చూసి అబ్బురపడుతూ ఉంటారట సందర్శకులు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)