మనవరాలితో పోటీ : సీనియర్‌ నేత దివాలీ సెలబ్రేషన్స్‌

Published on Fri, 10/24/2025 - 16:26

అనంతపురం జిల్లాకి  చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి డా. ఎన్‌ రఘువీరారెడ్డి ఈ దీపావళిని అందరికంటే భిన్నంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట  అందర్నీ ఆకట్టు కుంటోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా కీలక బాధ్యతలు నిర్వర్తించిన డా. నీలకంఠం రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రకృతిలో మమేకమై, వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపు తున్నారు. ఆయన ఫోటోలు బాగా వైరలయ్యాయి. రఘువీరారెడ్డి సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటారు. తరచూ అనేక వీడియోలను పోస్ట్‌ చేస్తూ, పలువురికి ప్రేరణగా నిలుస్తూ ఉంటారు. అంతేకాదు తనముద్దుల మనవరాలితో ఆనందంగా గడుపుతున్న విశేషాలను గతంలోనూ పంచుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా మనవరాలితో  చిన్నపిల్లాడిలా సంతోషంగా గడిపిన ఒక వీడియోను షేర్‌ చేశారు. దీపాల వెలుగులు, స్వీట్లతోపాటు మనవరాలితో సరదాగా ఆర్మ్ రెజ్లింగ్ మ్యాచ్‌తో ఈ దీపావళిని సెలబ్రేట్‌ చేసుకున్నాను  అని పోస్ట్‌ చేశారు.

దీంతో చాలామంది అభిమానులు ఫిదా అవుతున్నారు. అదిరింది సార్...సర్ చిన్న పాప సార్ నొప్పి పుడుతుంది విజయాన్ని తనకే ఇచ్చేయండి సార్...మమ్మల్ని అందరినీ గెలుపు వైపు నడిపించినట్టుగానే.. పాపను  కూడా గెలిపించండి అని కమెంట్‌ చేశారు.  రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మాకు రాజకీయాల్లో నచ్చిన వ్యక్తి మీరే.. మళ్లీ రాజకీయాల్లోకి రావాలి అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)