Breaking News

ధన త్రయోదశి ఆరోగ్యమస్తు ధన ప్రాప్తిరస్తు.. ప్రాశస్త్యం ఇదీ!

Published on Sat, 10/18/2025 - 11:39

నేడు ధనత్రయోదశి. సాధారణంగా ధన త్రయోదశి అనగానే బంగారం, వెండి, ఇతర గృహోపకరణాలు కొనడం అందరూ చేసేదే. అయితే ధనత్రయోదశి ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఆ కథ తెలుసుకుందాం. 

దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్న సమయంలో ఆ క్షీరసాగరం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతే కాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి.  శ్రీమహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం. అందుకే, ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని.. ‘ధన త్రయోదశి’ అన్నారు.

ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేక΄ోతే జీవితం గడపడం కష్టం. అందుకే.. సర్వ సంపత్‌ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీస్సులు అందుకుంటారు. ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి. ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో΄ాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళలో చేసుకుంటే చాలా మంచిది.

లక్ష్మీ కుబేర వ్రతం
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, వ్యాపార అభివృద్ధి అదే విధంగా నూతన వ్యాపారం ప్రారంభించబోయే వారు, ఉద్యోగ అభివృద్ధి కోరుకుంటున్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఆయా బాధల నుంచి విముక్తి  పొంది, అన్నింటా అభివృద్ధి జరుగుతుందని పెద్దలు చెబుతారు కాబట్టి ఈ వ్రతాన్ని చేయాలనుకుంటున్న వారు అక్షయ తృతీయ రోజు, ధన త్రయోదశి రోజు, కార్తీక శుక్ల పంచమి రోజు లేదా తొమ్మిది గురువారాలు లేక శుక్రవారాలు చేసుకోవచ్చు.

 చదవండి : Diwali 2025 : ఈవస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం
 

ధన్వంతరి జయంతి
దేవవైద్యుడు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అంశావతారమైన ధన్వంతరి పాలసముద్రం నుంచి ఆవిర్భవించింది కూడా ధనత్రయోదశి నాడే. అందుకే ఈ పర్వదినాన చాలామంది ధన్వంతరిని కూడా పూజిస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగలేనివారు, ఆయుర్వేద వైద్య విధానం మీద నమ్మకం ఉన్న వారు శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన ధన్వంతరిని పూజించడం వల్ల ఆరోగ్యవంతు లవుతారని చెబుతారు. ధన్వంతరి చేతిలో శంఖు చక్రాలతోపాటు ఔషధ భాండం లేదా అమృత కలశం, జలగ ఉంటాయి. జలగ శరీరంలో చేరిన చెడు రక్తాన్ని పీల్చివేసి ఆరోగ్యాన్నిస్తుందని ప్రతీతి. అందుకే ధన్వంతరి చేతిలో జలూకం అంటే జలగ ఉంటుంది. 

నేడు శని త్రయోదశి కూడా. ధనత్రయోదశి నాడే శని త్రయోదశి కూడా రావడం చాలా విశేషం. అందువల్ల ఈ వేళపాత వస్తువులు, పాత ఆలోచనలు, పాతదనాన్ని వదిలించుకుని, కొత్త వస్తువులు కొనుగోలు చేయటం, కొత్త ఆలోచనలు చేయటం, కొత్త పనులకు శ్రీకారం చుట్టడం చాలా మంచిది.

ఇదీ చదవండి: వెయిట్‌ లాస్‌లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్‌ ఫిట్నెస్‌ కోచ్‌ వార్నింగ్‌

పితృదేవతాపూజకు కూడా ధనత్రయోదశి చాలా ప్రశస్తమైనది. ధనత్రయోదశి నాడు ఇంటిలో దీపాలు వెలిగించి, మన పెద్దవారిని తలచుకోవడం వల్ల వారి ఆశీర్వాదంతో శుభం చేకూరుతుందని పండితులు చెబుతారు. ఈ శుభవేళ అందరికీ కీడు తొలగి మేలు చేకూరాలని కాంక్షిద్దాం.
– డీవీఆర్‌

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)