Breaking News

ప్రతిఫలం ఆశించే దానం.. నిజమైన దానం అవుతుందా?

Published on Thu, 11/05/2026 - 09:02

కోరికలేవీ పెంచుకోకుండా కర్మ చేయాలి. ఇలా చేయటాన్ని ‘నిష్కామ కర్మ’ అని అంటారు. మానవ జీవితంలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఘట్టాలు నాలుగు తారసిల్లు తాయి.  మొదటి మూడు దశల్లోనూ, ఒకదాని తర్వాత ఒకటి అనుభవిస్తూ ఆ యా దశల్లో ఆచరించవలసిన కర్మలను వరుసగా నిష్కామంగా ఆచరిస్తూ ముందుకు పోతూ ఉంటే తిరిగి వెనక్కు చూడనక్కర్లేదు.

పతనమనేది ఉండనే ఉండదు. తనకు మంచి పేరు రావాలనీ, పది మంది తన పేరు చెప్పుకోవాలనీ ఉబలాట పడుతూ సమాజసేవ చేస్తే పరమాత్మను చేరుకోలేరు. మెట్లనుంచి జారిపోతారు. అన్నదానం చేస్తారు, విద్యాదానం చేస్తారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకొంటారు, బాగానేవుంది కానీ వారి కృతజ్ఞతలకోసం ఎదురు చూడకూడదు.

లంకలో సీతామాతను చూసి హనుమంతుడు రాముడిచ్చిన ముద్రికను ఆమెకిచ్చి ఆమెనుండి తీసికొన్న చూడామణిని రాముడికిచ్చాడు. సాహసంతో అంతటి పని చేసిన ఆంజనేయునకు శ్రీరాముడు ఎంత ఉపకారమైనా చేయవచ్చు. కానీ ఏమీ చేయలేదు.   ఒక్కసారి హనుమంతుణ్ణి గాఢంగా కౌగిలించుకొన్నాడంతే. అంతతో ఆగక ‘నీకు నేనేమీ ప్రత్యుపకారం చేయను’ అని ఖండితంగా చెప్పాడు. ‘రాముడంతటి మహనీయుడు ఇలాగేనా చేయా ల్సింది’ అని సామాన్యులకు అనిపించి ఆంజనేయుని మీద జాలివేస్తుంది కదూ!

ఇక్కడే ఉంది పరమార్థం. నిజానికి అమూల్యమైందిచ్చాడు రాముడు: ఆలింగనం. ఎంత పుణ్యం చేసుకుంటే ఆ అవతార పురుషుని ఆలింగనం దొరుకుతుంది చెప్పండి. ‘నేనే నీవు, నీవే నేను’ అని అభేద భావాన్ని చెప్పేది ఆలింగనం. ఆ అదృష్టం హనుమకు మాత్రమే దొరికింది. ఆంజనేయునికి రాముడు ప్రత్యుపకారం చేయవలసిన అవసరం ఎన్నడూ కలగదని రాముని ఆంతర్యం. ఆంజనేయుడు మహా భక్తుడు కనుక రాముని ఆంతర్యము అర్థమై ఆనందించాడు. దీన్ని బట్టి నేర్చుకోవలసిందేమిటంటే ప్రత్యుపకారం కోరి ఎవ్వరూ దానం చేయరాదు అని. అప్పుడది నిష్కామకర్మ అవుతుంది.
- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

ఇదీ చదవండి: అక్కడ దీపావళి రోజున ఉపవాసాలు, ప్రార్థనలు..

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)