Breaking News

డిజైన్‌ డెమోక్రసీ..!

Published on Thu, 08/21/2025 - 10:45

ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్‌ ఉత్పత్తులకు సంబంధించిన పాపులర్‌ ప్రదర్శన డిజైన్‌ డెమోక్రసీ వచ్చేనెల 5న నగరంలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరగనుంది. బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన నిర్వాహకులు ఎక్స్‌పో వివరాలను వెల్లడించారు. 

ఇందులో 120కి పైగా ప్రముఖ బ్రాండ్‌లు, 80పైగా పేరొందిన స్పీకర్లు పాల్గొంటారని, 15 వేలకుపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 3 రోజుల ప్రదర్శనలో చర్చలు, ఆవిష్కరణలు.. వంటివి ఉంటాయన్నారు. 

ఫర్నిచర్, లైటింగ్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు, వంటగది, బాత్, డెకర్‌ ఉపకరణాలు ఫైన్‌ఆర్ట్, క్రాఫ్ట్‌ వంటి వాటి ఎంపికలో నగర వినియోగదారుల అభిరుచులను కొత్తస్థాయికి ఇవి చేరుస్తాయన్నారు. సమావేశంలో సహ వ్యవస్థాపకులు శైలజా పట్వావరీ, మల్లికా శ్రీవాస్తవ్, క్యూరేటర్‌ అర్జున్‌ రతి పాల్గొని మాట్లాడారు.

విద్యార్థి ప్రతిభ..
ఎఫ్‌డీడీఐ–హైదరాబాద్‌ విద్యార్థులు చదువుతోపాటు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఎఫ్‌డీడీఐలోని ఎల్‌ఎల్‌పీడీకి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి జీవా ప్రోటోటైప్‌ ఉత్పత్తిగా కుట్టులేని నాణెం పౌచ్‌కు రూపకల్పన చేశారు. 

రావి(పీపాల్‌) ఆకు రూపం, ఆకృతి నుంచి ప్రేరణ పొంది ఆకుపచ్చ రంగులో కృత్రిమ తోలు, గుండు సూది, షూలేస్‌ను ఉపయోగించి కుట్లు లేకుండా ఈ పౌచ్‌ను తయారు చేశాడు. జీవాను ఎఫ్‌డీడీఐ –హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తేజ్‌లోహిత్‌రెడ్డి, ఫ్యాకల్టీ ప్రతినిధులు వేణుగోపాల్, గోఫ్రాన్, రుచిసింగ్, హుస్సేన్, రాంబాబు అభినందించారు. 
– రాయదుర్గం   

(చదవండి: నయా ట్రెండ్‌.. గణేశుడికి గ్రాండ్‌ వెల్‌కమ్‌!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)