Breaking News

హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్‌ అంతే..

Published on Tue, 07/28/2026 - 16:28

వృత్తి కొందరికీ ఒక ప్యాషన్‌ అయితే..వాళ్లు అందులో చూపించే క్రియేటివీ మాములగా ఉండదు. ఏ పనిచేసినా..అది అద్భుతంగా ఆలోచనాత్మకంగా ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ ఉపాధ్యాయురాలు. 

పెద్ద పెద్ద క్రియేటివిటీలతో పనిలేదు. కాస్త అభిరుచితో చాలా సింపుల్‌గా కూడా అద్భుతం సృష్టించొచ్చు. అదే చూపించింది ఈ ఢిల్లీ ఉపాధ్యాయురాలు. విద్యార్థులు రెగ్యులర్‌గా క్లాస్‌కి వచ్చేలా చేసేందుకు ఆమె సృజనాత్మకంగా ఆలోచించిన తీరు తెలిస్తే నోటమాటరాదు. అందుకోసం ఏం పెద్ద పరికరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులేం ఉపయోగించలేదు. జస్ట్‌ ఒక పేపర్‌ బోర్డు,  చిన్న చిన్న అగ్గిపెట్టెలతోటే అంతా చేశారామె. వాళ్లంతా తమ హాజరును తామే వేసుకునేలా అవకాశం ఇచ్చి..బాధ్యతగా వ్యవహరించేలా చేసింది. 

ముఖ్యంగా రోజూ వచ్చేలా నిబద్ధతను మెదళ్లులో నాటినట్లుగా చేసిన పని అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మొదట ఉపాధ్యాయురాలు తరగతి గదిలోకి ప్రవేశించగా..వెనుక విద్యార్థులు ఒక్కొక్కరుగా లోపలికి వచ్చారు.లోపలికి ప్రవేశించిన వెంటనే, ఆమె చేసిన మొదటి పని, చేతితో తయారు చేసిన ఆ స్వీయ-హాజరు బోర్డుపై తన హాజరును గుర్తించడం. ఆ టీచర్‌నే అనుసరిస్తూ..మిగతా విద్యార్థులంతా స్వీయంగా తమ హాజరును నమోదు చేసుకున్నారు. 

అందుకోసం ఒక పెద్ద బోర్డుపై చిన్న అగిపెట్టెలను పెట్టి..వాటిపై ప్రతి విద్యార్థి ఫోటో ఉండేలా చేశారు. దానిలోపల బాక్స్‌లో పీ "P" అనే అక్షరాన్ని ఉంచారు. క్లాస్‌కి వచ్చిన వాళ్లంతా ఆ బోర్డుపై ఉన్న అగ్గిపెట్టెని ఓపెన్‌ చేసి P" అనే అక్షరాన్ని బయటకు కనిపించేలా పెడతారు. రానివాళ్లు పెట్టేపై ఆటోమేటిగ్గా కనిపిస్తున్న "O" అనే అక్షరం కనిపిస్తుంది. ఆమె ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ నా చిన్నారులు బాధ్యత తీసుకుంటున్నారు అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. నెటిజన్లు కూడా అద్భుతమైన ఆలోచన..బాధ్యతా భావాన్ని పెంచేలా ప్రోత్సహిస్తున్నారంటూ  పోస్టులు పెట్టారు.

(చదవండి: ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)