Breaking News

కోహ్లి ఆర్సీబీ గెలుపుతో ఢిల్లీ పోలీసులు యువతకు సందేశం..!

Published on Wed, 06/04/2025 - 16:38

ఏ విజయమైన స్ఫూర్తిని, చక్కటి సందేశాన్ని అందిస్తుంది. అంతేగాదు ఎందరో పరాజితుల్లో కొండంత ఆశలను నింపి..సాధనకు ఉపక్రమించేలా చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే..గెలుపును అందుకోవడంపై గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఐపీఎల్‌లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్రికెట్‌ అభిమానులనే ఆశ్చర్యపరిచేలా ఆర్సీబీ ఘన విజయం అందుకుంది. ఎన్నాళ్లుగానో ఐపీఎల్‌లో విజయం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)కి అందని ద్రాక్షలా ఉండిపోయిందో తెలిసిందే. ఎట్టకేలకు 18వ సీజన్‌లో ఆ కలను సాకారం చేసుకుంది ఆర్సీబీ. ఇక్కడ ఆర్సీబీ విజయం ఓ చక్కటి సందేశం తోపాటు స్ఫూర్తిని కూడా నింపింది. 

రావడం లేదు, అందుకోలేకపోతున్నా అన్న నిరాశ నిస్ప్రుహలకు ఒక్క గెలుపుతో చెక్‌పెట్టొచ్చని ఆర్సీబీ విజయంతో తేటతెల్లమైంది. ఓపికతో నిరీక్షించేవాడు ఎన్నటికైన విజయం అందుకుంటాడు. విసుగే చెందాక ప్రయత్నిస్తేనే విజయమనే నిధిని అందుకోగలమనే సామెతకు నిర్వచనంగా మారింది ఆర్సీబీ. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ తెరపడేలా ఘన విజయం అందుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. 

మనం కూడా ఓటములతో సతమతమవుతున్నప్పుడూ..చుట్టూ ఉన్నవాళ్లు అస్సలు గెలుస్తావా అన్నట్లు చూసే చూపులు తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని ఓర్చుకుంటూ ఓపికతో లక్ష్యంపైనే ఫోకస్‌ పెట్టేవాడిని ఎన్నటికైనా విజయలక్ష్మీ వరిస్తుందనడానికి ఉదాహరణగా ఆర్సీబీ ఆటగాళ్లు నిలిచారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి ఈ ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్నాడు. ఎట్టకేలకు 18వ సీజన్‌లో తన కలను సాకారం చేసుకున్నాడు. 

విచిత్రంగా విరాట్‌ జెర్సీ నంబర్‌ కూడా 18 కావడం మరింత విశేషం. చెప్పాలంటే విరాట్‌ కోహ్లి ఓపికకు దక్కే ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ పోలీసులు ఓ విన్నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చూడండి విరాట్‌ కోహ్లీగెలుపు కోసం 18 ఏళ్లు వేచి ఉన్నాడు. అలాగే డ్రైవింగ్‌ చేసేందుకు 18 ఏళ్లు నిండే వరకు ఓపిక పట్టండి. 

అలా కాకుండా టీనేజర్లుగా ఉన్నప్పుడే త్వరపడి కన్నవాళ్లకు శోకం మిగల్చడం లేదా అవతల ప్రయాణికుల ప్రాణాలను పొట్టబెట్టుకుని నేరస్థులుగా మిగిలిపోవడం జరుగుతుంది అని తమ అధికారిక ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్‌ చేశారు. అంతేగాదు అందులో టీనేజర్లు చట్టబద్ధంగా డ్రైవింగ్‌ వయస్సు వచ్చే వరకు వేచి ఉండండి లేదంటే అసహనం తెచ్చిపెట్టే అనర్థాలకు బలైపోతారని క్యాప్షెన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేశారు. నిజంగా ఒక​ గెలుపు ఎన్నో రకాలుగా స్ఫూర్తిని నింపుతుందంటే ఇదే కదూ..!.

 

(చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్‌టాపిక్‌గా హర్ష్‌గోయెంకా ప్రసంగం)

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)