Breaking News

ఆ పాటకు డ్యాన్స్‌ చేయడంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది..!

Published on Sun, 02/02/2025 - 14:37

కాసేపట్లో పెళ్లితో కళకళలాడాల్సి వేదిక కాస్త ఒక్కసారిగా నిశబ్దమైపోయింది. పాపం వరుడు ఏదో సరదాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ చేద్దాం అనుకుంటే..అదే తనకు ఊహించని బాధని, అవమానాన్ని మిగిల్చింది. ఏ పాటకు కాలు కదిపితే బాగుంటుందో సంమయనంతో ఆలోచిస్తే బాగుండేది. లేదంటే ఇలాంటి దుస్థితి పట్టేది కాదేమో. కొన్ని విషయాల్లో కామెన్‌ సెన్స్‌తో వ్యవహరించాలి. లేదంటే ఆ వరుడిలా చేదు అనుభవాన్ని ఎదుర్కొనక తప్పేదేమో..!. 

ఈ ఘటన న్యూఢిల్లీ(New Delhi)లో చోటు చేసుకుంది. వరుడు(Groom) ఊరేగింపుతో న్యూఢిల్లీలోని వివాహ మండపం వద్దకు చేరుకున్నాడు. అయితే అతడి స్నేహితులు నృత్యం చేయమని బలవంతం చేయడంతో ప్రసిద్ధ బాలీవుడ్‌ పాట(Bollywood Song) 'చోళీ కే పీఛే క్యా హై'కి డ్యాన్స్‌ చేశాడు. అందులోనూ సాక్షాత్తు వరుడు ఈ పాటకు డ్యాన్స్‌ చేయడంతో వధువు తండ్రికి చాలా అవమానంగా అనిపించింది. 

కాబోయే అల్లుడు తీరు ఇలా ఉందేంటని వెంటనే పెళ్లి(Wedding)ని అర్థాంతరంగా ఆపేసి వివాహ తంతుని రద్దుచేసుకుంది వధువు కుటుంబం. వరుడు చర్యలు కుటుంబ విలువలను అవమానించేలా ఉన్నాయని చెబుతూ వధువు కుటుంబం అక్కడ నుంచి నిష్రమించినట్లు సమాచారం. ఈ ఘటనతో వధువు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే వరుడు ఇదంతా ఏదో ఫన్‌ కోసం అని వధువు తండ్రిని ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. 

సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం..వధువు తండ్రికి వరుడు చేసిన పని చాలా ఆగ్రహం తెప్పించిందని, ఆయన అందుకే తక్షణమే పెళ్లిని నిలిపేసినట్లు చెబుతున్నారు బంధువులు. అలాగే తన కుమార్తెతో ఆ వరుడు కుటుంబం ఎలాంటి సంబంధాలు నెరకూడదని వధువు తండ్రి గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మాత్రం ఆ తండ్రి సరైన నిర్ణయం తీసుకున్నాడు. 

లేదంటే ఈ డ్యాన్స్‌ రోజు చూడాల్సి వచ్చేదంటూ వధువు తండ్రికే మద్దతిస్తూ పోస్టులు పెట్టారు. ఈ కథ మన చుట్టు ఉన్నవాళ్లు, స్నేహితులు ఫన్‌ అంటూ ఏదేదో చేయమంటారు. కానీ అది సరైనదా కాదా అని ఆలోచించి అడుగు వేయపోతే నష్టపోయేది మనమే. ఆ ఫన్‌ సంతోషం తెప్పించకపోయినా పర్లేదు..మన చేత కన్నీళ్లు పెట్టించేదిగా ఉండకూడదు.

(చదవండి: 'ది గ్రామఫోన్ గర్ల్': శాస్త్రీయ సంగీతాన్ని జస్ట్ మూడు నిమిషాల్లో..!)

 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)