Breaking News

పదకొండేళ్లుగా ఆ అలవాటు ఎంత పనిచేసిందంటే..! చివరికి కడుపులో..

Published on Thu, 09/03/2026 - 17:31

కొన్ని అలవాట్లను చుట్టూ ఉన్న సన్నిహితులు, స్నేహితులు గమనించకపోతే..ఎంతటి ప్రమాదం కొనితెచ్చుకుంటారో చెబుతోంది ఈ ఉదంతం. ఆమెకు తొమ్మిదేళ్లుగా ఉన్న అలవాటు గురించి 20 ఏళ్ల తర్వాత అనారోగ్యం కారణంగా బయటపడి ఆస్పత్రిపాలుజేసింది. 

ఈ విచిత్ర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంంది. ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యువతికి తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. వికారం, పదే పదే వాంతులు అవ్వడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె కడుపు పైభాగం ఉబ్బి ఉండటంతో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్ట్‌లో ఆమె కడుపులో భారీ పరిమాణంలో హెయిర్‌బాల్‌  ఉన్నట్లు గుర్తించారు. ఇ

ది ఆహారనాళం, కడుపు కలిసే చోట చిన్న ప్రేగులకు వెళ్లే ద్వారం వరకు విస్తరించి ఉండటంతో ఎండోస్కోపీతో తొలగించడం సాధ్యం కాలేదు. దాంతో ఆమెకు సర్జరీ చేయక తప్పలేదు. ఇది సుమారు 1.16 కిలోల పరిమాణంలో ఆంగ్ల  అక్షరం ‘జే’ ఆకారంలో ఉంది. ఆమె కడుపు దాదాపు జుట్టుతో నిండిపోయి ఉందని, ఎండోస్కోప్‌ చేస్తే కడుపు పైపొర దెబ్బతినే అవకాశ ఉన్నందున శస్త్ర చికిత్స చేసి ఆ హెయిర్‌ బాల్‌ని తొలగించినట్లు తెలిపారు వైద్యులు.

హెయిర్‌బాల్‌ ఏర్పడటానికి కారణం..
ఆహారంలా కాకుండా, మానవ వెంట్రుకలు జీర్ణం కావు. వెంట్రుకలను పదేపదే మింగినప్పుడు, అవి క్రమంగా కడుపులో పేరుకుపోతాయి. కాలక్రమేణా, ఆ పదార్థం గట్టిగా అతుక్కుపోయి, ఆహారాన్ని, ఇతర పదార్థాలని గట్టిగా బంధించి ఒక దట్టమైన బెజోర్‌గా ఏర్పడుతుంది. చిన్న బెజోర్‌లను కొన్నిసార్లు ఎండోస్కోపీ ద్వారా తొలగించవచ్చు, కానీ చాలా పెద్దవి లేదా గట్టిగా అతుక్కుపోయిన ఉండలకు శస్త్రచికిత్స అవసరం.

ప్రస్తుతం ఆ యవతి ఆరోగ్యం మెరుగుపడినట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందులా ఆకలి లేకపోవడం, అరగకపోవడం వంటి సమస్యలు ఆమెకు లేవన్నారు. అయితే ఆమె ఏళ్ల తరబడి వెంట్రుకలు తినే అలవాటు ఉందని, ఎవ్వరికీ ఇది తెలియలేదని చెబుతున్నారు వైద్యులు. 

కాగా, ఇలా వెంట్రుకలు తినే అలవాటుని ట్రైకోఫాగియా అంటారు. ఈ అలవాటుని నుంచి బయపటడకుండా వెంట్రుకల ఉండను తొలగిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదంటున్నారు. అలాంటి అలవాటు ఉన్నవారిని సైక్రియాట్రిస్టుల వద్దకు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ ఇప్పించి ఆ అలవాటు నుంచి బయటపడేలా చేయాలని చెబుతున్నారు వైద్యులు.

(చదవండి: సాధువుగా మారి..54 ఏళ్ల వయసులో సీఆర్పీఎఫ్‌ పోలీస్‌గా!)

 

#

Tags : 1

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)