Breaking News

నో ఫ్యాషన్‌ డైట్‌.. జస్ట్‌ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్‌గా నటి దీప్తి సాధ్వానీ

Published on Thu, 07/31/2025 - 17:55

బరువు తగ్గేందుకు సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు నానాప్రయాసలు పడి మరీ స్లిమ్‌గా మారుతున్నారు. ఆహార్యం పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండాలన్నదే అందరి అటెన్షన్‌. అయితే ఆ బరువు తగ్గే ప్రయాణం అంత ఈజీగా విజయవంతం కాదు. ఎందుకంటే..ఎక్కడ రాజీపడని దృఢ సంకల్పంతో ముందుకు సాగినవారే మంచి ఫలితాలను అందుకుని చక్కటి ఆకృతితో మన ముందుకు వస్తున్నారు. అలాంటి కోవలోకి బాలీవుడ్‌ బుల్లితెర నటి తారక్ మెహతా కా ఊల్తా చాష్మా ఫేమ్ దీప్తి సాధ్వానీ కూడా చేరిపోయారు. ఎలాంటి షార్ట్‌కట్‌లు డైట్‌లు పాటించకుండానే ఆరోగ్యవంతంగా బరువు తగ్గి అందరిచేత ప్రశంసలందుకుంటోంది దీప్తి. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో సవివరంగా చూద్దామా..!.

34 ఏళ్ల దీప్తి సాధ్వానీ తారక్ మెహతా కా ఊల్తా చాష్మాలో ఆరాధన శర్మ పాత్రతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సంపాదించుకున్న నటి. గతేడాది తన బ్యూటిఫుల్‌ లుక్‌తో ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచింది. ఇండ సడెన్‌గా అంతలా మెరుపు తీగలా ఎలా  అని విస్తుపోయారంతా. అంతలా తన ఆహార్యాన్ని మార్చుకుంది దీప్తి. అంతేగాదు తాను ఎలా స్లిమ్‌గా మారిందో కూడా ఓ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నారామె. 

తాను ఎలాంటి క్రాష్‌ డైట్‌లు ఫాలో కాలేదని, కనీసం బరువు తగ్గే మాత్రలను కూడా ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామాలతోనే బరువు తగ్గించుకున్నానని తెలిపింది. అయితే ఏ నెల స్కిప్‌ చేయకుండా వెయిట్‌లాస్‌ జర్నీని విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. అలాగే బరువు తగ్గడం ఏమంత సులువు కాదని చెబుతోంది. ఇక్కడ అంకితభావంతో డుమ్మా కొట్టకుండా  పాటిస్తేనే మంచి ఫలితాలు త్వరితగతిన పొందగలమని చెబుతోంది. 

ముఖ్యంగా చక్కెరకు సంబంధించినవి, ప్రాసెస్‌ చేసిన ఆహారాలను దరిచేరనివ్వకుండా చేస్తే చాలు బాడీలోని మార్పులు త్వరితగతిన సంతరించుకుంటాయంటోంది. దీంతోపాటు రోజుకి 16 గంటలు అడపాదడపా ఉపవాసం ఉంటుందట. అలాగే మైండ్‌ఫుల్‌ కేలరీ ట్రాకింగ్‌ వీటన్నింటితో సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకున్నానని చెబుతోంది. 

ఇవి మంచివేనా అంటే..
కెనడాలోని కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ జర్నల్‌ సైతం అడపాదడపా ఉపవాసం అనుసరించే వ్యక్తులు తక్కువ వ్యవధిలో 0.8% నుండి 13% బరువు తగ్గుతారని పేర్కొంది. అలాగే కేలరీలరట్రాకింగ్‌అనేది కూడా అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే బరువు తగ్గడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందట. 

ఇక దీప్తి వ్యాయమాలు దగ్గరకు వచ్చేటప్పటికీ బాక్సింగ్‌, ఈత, వైమానిక యోగా వంటివి చేసినట్లు వెల్లడించింది. ఒకటే రొటీన్‌ వ్యాయమాలు కాకుండా మారుస్తూ చేస్తూ.. ఉంటే..బాడీకి స్వాంతన తోపాటు..చేయాలనే ఉత్సాహం వస్తుందని చెబుతోంది. ఇక్కడ బరువు తగ్గడం అనేది శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుందనని అంటోంది దీప్తి సాధ్వానీ. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్‌ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..)
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)