Breaking News

నా డ్రీమ్స్‌.. కరియర్‌ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా

Published on Fri, 05/02/2025 - 17:59

మాతృత్వం ఒక వరమే.కానీ అంతకుమించిన బాధ్యతల భారం కూడా. కుటుంబ సభ్యులు, భర్త సహకారం ఉన్నపుడు నిజంగా ఏ మహిళకైనా గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం, పాలిచ్చి పోషించడం లాంటి వన్నీ  జీవితాంతం పదిలపర్చుకునే మధుర  జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.  ఇంత ముఖ్యమైన విషయాన్ని అటు కుటుంబ  సభ్యులు, ఇటు సమాజమూ గుర్తించాలన్న స్పృహ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీనికి తోడు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై బహిరంగంగా చర్చిస్తుండటం మంచి పరిణామం. ఈ కోవలోకి తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా  పదుకొణే చేరింది.

హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు దీపికా పదుకొణే (Deepika Padukone).  అందానికి తగ్గ అభినయం,  అభిమానుల హృదయాలను దోచుకుంది.   బాలీవుడ్‌లో అనేక బ్లాక్‌ బస్టర్‌ మూవీలను తన సొంతం చేసుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల ఫ్యావరేట్‌గా మారింది.   హీరోయిన్‌గా  కరియర్‌ కొనసాగిస్తూనే, బాలీవుడ్‌ హీరో,ప్రేమికుడు రణవీర్ సింగ్‌ను 2018లో వివాహం చేసుకుంది. 2024లో  తొలి  బిడ్డ దువాకు జన్మనిచ్చింది. వేవ్స్ సమ్మిట్ 2025లో దీపిక తన కూతురు దువాకుతో   తనకున్న అనుబంధం,  చిన్నారి వచ్చిన తరువాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది.

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో మాతృత్వం, బిడ్డ పెంపకం గురించి మాట్లాడినపుడు. దీపికా పదుకొనే మాతృత్వాన్ని స్వీకరించడం గురించి, దువా రాక  తన  జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది స్పష్టంగా,చాలా ఉత్సాహంగా చెప్పుకొచ్చింది.  పాపాయి రక్షణ  కోసం  ఎలాంటి ఆయాను (నానీ)ని నియమించుకోలేదు దీపిక. స్వయంగా తానే ఆ బాధ్యతను తానే తీసుకుంది.  తల్లినయ్యాక కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నానని   చెప్పింది. తల్లికాక ముందు, తన కలలు తన ఆశయాలు మాత్రమే ఉండేవి, కానీ ఇపుడంతా ఆమె గురించే. 

ఇదీ చదవండి:  నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్‌ షూస్‌ : ఎవరీ అందాల రాణి?

"అమ్మ అయిన తర్వాత కొత్త జీవితాన్ని  చూస్తున్నాను.  బిడ్డను కన్న క్షణంనుంచి మరో ప్రాణిని పోషించే బాధ్యత వహించాలి. ముఖ్యంగా నాలాంటి  జీవనశైలి ఉన్నవారికి, ముఖ్యంగా ఇల్లు వదిలి వెళ్ళడం, నా ఆశయం, నా కెరీర్  ఇలా  ప్రతిదీ నా జీవితం, ఇలా ప్రతిదాని గురించి ఆలోచించాను. ఇప్పుడు, అకస్మాత్తుగా,  పాపాయి మీద శ్రద్ద వహించాలి. తల్లి కావాలని కోరుకున్నాను కనుక, ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాను, " అని దీపికా పేర్కొన్నారు.

మరోవైపు షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణేను ప్రశంసల్లో ముంచెత్తారు. దువాకు తల్లి అయినందుకు షారుఖ్ దీపికను అభినందించారు. నటి పోషించగల ఉత్తమ పాత్ర నిజ జీవితంలోనే అని, ఇప్పుడు ఆమె తన పాప దువాకు తల్లి అని  అన్నారు.

చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌!

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు