Diwali 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..

Published on Mon, 10/13/2025 - 12:12

దీపావళి అనగానే టపాసులు, బాణ సంచాలతో సరదాగా సాగే పండుగ. పెద్దలు సైతం చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్‌ చేసేలా చేసే వేడుక ఇది. ఈ పండుగ ఇంటే అందరికీ మహా ప్రీతి. అలాంటి పండుగ పేరుతోనే రెండు గ్రామాలు ఉన్నాయి. అది కూడా ఒకే జిల్లాలో రెండు గ్రామాల పేర్లు దీపావళి. అయితే ఒక చోట ఈ పండుగ ఐదు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తే..మరోచోట మాత్రం ఏ ఇంట్లో దీపమే వెలిగించరు. మరి ఆ పండుగ పేరుతో ఏర్పడిన ఆ రెండు గ్రామల వెనుక ఉన్న ఆసక్తికర కథేంటో తెలుసుకుందామా..!.. 

దీపాల కాంతితో కళకళలాడే ఈ దీపావళి పండుగ పేరుతో ఉన్న రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లాకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గారమండలంలో ఉండగా, మరొకటి టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీ పరిధిలో మరో గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల పేర్లు 'దీపావళి'. వాటికి ఈ పండుగ పేరు ఎలా వచ్చిందంటే..

గారమండలంలోని ఊరుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగరాజు కూర్మనాథాలయానికి వచ్చే వారట. స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా.. స్ప్రుహ తప్పి పడిపోయారు. అప్పుడు అక్కడ ఉండే స్థానికులు ఆ రాజుకి సపర్యలు చేశారు. కొద్దిపేపటికి మెలుకువ వచ్చిన తర్వాత రాజు తనకు సపర్యలు చేసిన వారిని ఈ గ్రామం పేరెంటని అడగగా..తమ ఊరికి పేరు లేదని చెప్పారట గ్రామస్తులు. 

దాంతో రాజుగారు తనకు దీపావళి నాడు ఇక్కడి ప్రజలు ప్రాణదానం చేసి సాయం చేశారు కాబట్టి ఈ ఊరు పేరు 'దీపావళి' అని నామకరణం చేశారని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అధికారిక రికార్డుల్లో సైతం ఈ గ్రామానికి అదే పేరు స్థిరపడి ఉండటం విశేషం. ఆ పండుగ రాజుగారి రాజరికదర్పానికి తగ్గట్టుగా ..ఆ రేంజ్‌లోనే అక్కడి ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారట. 

మొత్తం ఐదు రోజుల పాటు ఘనంగా ఈ పండుగను నిర్వహిస్తారట. అంతేగాదు గ్రామం మొత్తం వేల దీపాలను వెలిగించి..నాటి చారిత్రక ఘటనకు గుర్తుగా తమ గ్రామం ప్రమిదల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోయాల వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. 

ఈ ఊరికి మాత్రం గమ్మత్తుగా వచ్చిందా పేరు..
శ్రీకాకుళం జిల్లాలోనే టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతిలో ఉన్న ఈ గ్రామం పేరు కూడా 'దీపావళినే'. అయితే దీన్ని మొదట్లో చుట్టుపక్కల గ్రామల ప్రజలు దీపాల పేటగా పిలిచేవారట. రానురాను వాడుకభాషలో దీపావళి ఊరుగా స్థిరపడిందట . అయితే ఇక్కడ ప్రజలెవ్వరూ దీపావళి పండుగను జరుపుకోరు. అక్కడ ఏ ఒక్క ఒక్క ఇంట్లో కూడా ప్రమిదలు వెలిగించరు. ఎందుకంటే..

ఎలుక కారణంగా దూరమైన పండుగ..
పూర్వం ఈ గ్రామంలో ప్రతి ఇల్లు తాటాకు గుడిసెలే. పైగా కరెంటు సదుపాయం కూడా ఉండేది కాదట. దీంతో ఇళ్లల్లో నూనె దీపాలు వెలిగించి ఉంచేవారట. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక దీపాన్ని దొర్లించడంతో ఓ గుడిసెకు అంటుకున్న మంటలు ఊరంతో వ్యాపించి..మొత్తం గ్రామంలో విషాదం నెలకొందట. 

దాంతో అప్పటి నుంచి ఈ గ్రామంలో దీపావళి పండుగనే జరుపుకోవడం లేదట. అంతేగాదు ఇక్కడ నాగుల చవితిని కూడా జరుపుకోరట. ఒకవేళ ఎవ్వరైన చేస్తే..ఆ ఇంట్లో ఎవ్వరో ఒకరు చనిపోవడం జరుగుతుందట. దాంతో అక్కడి స్థానిక ప్రజలు ఈ రెండు పండుగలను ఎట్టిపరిస్థితుల్లోనూ జరుపుకోరని చెబుతున్నారు. ఈ మూఢనమ్మకాలకు తిలోదాకాలు ఇచ్చి..ఎలాగైనా ఈ పండుగను మిగతా గ్రామాల మాదిరిగానే చేసుకోవాలని అక్కడి యువత గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు పలువురు పెద్దలు చెబుతుండటం విశేషం.

(చదవండి: చంద్రభాగ బీచ్‌..! సైకత శిల్ప వేదిక..)

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)