Breaking News

కోట్ల సంపద ఉన్నా దక్కని ‘మనశ్శాంతి’ యోగం

Published on Sat, 12/20/2025 - 14:48

ఈ రోజుల్లో మహా సంపద...మనశ్శాంతి. ‘కోట్ల సంపద ఉంది. మనశ్శాంతి లేదు’ అనేవారు ఉన్నారు. ‘చిల్లిగవ్వ లేదు...ఎంతో మనశ్శాంతి ఉంది’ అనేవారు ఉన్నారు. మనశ్శాంతి అనేది డబ్బు, హోదాతో కొలవలేనిది. అరుదైన మనశ్శాంతి సొంతం చేసుకోవడానికి దగ్గరికి దారి...ధ్యానం....


ఈ సంవత్సరానికి సంబంధించి ఉత్తేజకరమైన ధ్యాన ధోరణులలో ఒకటి....మెడిటేషన్‌ అప్లికేషన్‌లలో కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయడం. ఈ అధునాతన యాప్‌లు వ్యక్తి గతీకరించిన ధ్యాన అనుభవాలను అందిస్తున్నాయి. మానసిక ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరైన ధ్యాన అభ్యాసాలను కనుగొనడాన్ని సులభతరం చేశాయి. 

ఆధునిక ధ్యానపద్ధతులలో వర్చువల్‌ రియాలిటీ(వీఆర్‌) కీలకపాత్ర  పోషిస్తోంది. బయోమెట్రిక్‌ సెన్సర్‌లకు సంబంధించి వేరబుల్‌ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా మారింది. ధ్యాన సమయంలో ఒత్తిడి స్థాయిలు, హార్ట్‌ రేట్‌ను పర్యవేక్షించడంలో ఈ సాంకేతికత అభ్యాసకులకు ఉపయోగ పడుతుంది.

ధ్యానానికి ఉపకరించే సాంకేతికత వల్ల అభ్యాసకుల సంఖ్య పెరుగుతోంది. ధ్యానప్రక్రియను సులభతరం చేస్తోంది. సమూహ ధ్యానాలు పెరగడం అనేది సంవత్సరం ట్రెండ్‌లలో ఒకటి. సామూహిక ధ్యానాల వల్ల ధ్యాననప్రక్రియ మరింత ఆనందకరంగా, ప్రయోజనకరంగా మారుతుంది అంటారు విశ్లేషకులు. మెడిటేషన్‌ యాప్స్‌ వర్చువల్‌ గ్రూప్‌ సెషన్‌లకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సాధకులను ధ్యానం అనే దారంతో ఒక దగ్గర చేరుస్తున్నాయి. తమ ధ్యాన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఈ గ్రూప్‌ సెషన్‌లు ఉపయోగపడుతున్నాయి. 

లేటెస్ట్‌ మెడిటేషన్‌ ట్రెండ్స్‌లో ఒకటి...పర్సనలైజ్‌డ్‌ మెడిటేషన్‌. వ్యక్తిగత అవసరాలు, జీవనశైలికి అనుగుణంగా వ్యక్తిగతీకరించిన ధ్యాన అభ్యాసాలే.. పర్సనలైజ్‌డ్‌ మెడిటేషన్‌. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో కూడిన యాప్‌లు అభ్యాసకుల మానసిక స్థితి, శారీరక ప్రతిస్పందనల ఆధారంగా ధ్యానప్రక్రియకు రూపకల్పన చేస్తున్నాయి.

స్వీయ సంరక్షణ, మానసిక ఆరోగ్యాన్ని నొక్కి చెప్పే  సాంస్కృతిక ఉద్యమాలు సాంకేతికతను, సంప్రదాయ ధ్యాన అభ్యాసాలతో అనుసంధానిస్తున్నాయి. గైడెడ్‌ సెషన్‌లను అందించే మొబైల్‌ యాప్‌లు పెరుగు తున్నాయి. 

ఇదీ చదవండి: టీవీ డిబేట్‌లో రామ్‌దేవ్‌ బాబాను ఎత్తి కుదేశాడు : వైరల్‌ వీడియో

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)