Breaking News

నీట్‌లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!

Published on Wed, 06/18/2025 - 17:07

ఆర్థికంగా వెనకబడిని వారికి ఉన్నత చదువులు అందని ద్రాక్షలాంటివే. చదవగలిగే ప్రతిభ ఉన్న..అందుకు తగిన ఆర్థిక సాయం, ప్రోత్సాహం కరువైతే..వారి ప్రతిభ అడుగంటిపోతుంది. పైగా దేశం గొప్ప మేధావులను కోల్పోతుంది ​కూడా. ఆ ఉద్దేశ్యంతో వెనుబడిన వర్గాల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్ల రూపంలో చదువుకునే అవకాశాన్ని అందిస్తోంది. అలా ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుని ఈ మూగ్గురు అమ్మాయిలు ప్రతిష్టాత్మకమైన నీట్‌ పరీక్షల్లో సత్తా చాటారు. అంతేగాదు సర్కారు చదువు సత్తా ఏంటో తెలిసేలా చేశారు. 

యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ మారిహాన్ గ్రామంలోని ప్రభుత్వ సర్వోదయ విద్యాలయానికి చెందిన మొత్తం 12 మంది బాలికలు వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. హాజరైన బాలికల్లో దాదాపు సగానికి పైగా అందరు వెనుకబడిన వర్గాలకు చెందినవారే. యూపీ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఘనత ఇది. 

ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం ఏర్పాటైన సర్వోదయలో బాలికలు ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలో వారంత ఆరు నుంచి 12 తరగతులు వరకు చదువుకుంటారు. అక్కడే రెడిడెన్షియల్‌ స్కూల్‌లో ఈ ఏడాది జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలకు కోచింగ్‌ కూడా పోందారుద. వారిలో వ్యవసాయ కూలీ కూతురు ప్రిన్సీ, రైతు కూతురు పూజ రంజన్‌, సైకిల్‌ సీట్‌ కవర్లు అమ్మే దుకాణందారుడు కూతురు కౌశాంబి శ్వేత ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 

వారి వచ్చిన నేపథ్యం దృష్ట్యా డాక్టర్‌ కావలనే కోరిక మసకబారిపోతుందనే అనుకున్నారు. అందులోనూ ప్రభుత్వ పాఠశాల చదవే తాము ఈ నీట్‌ ఎగ్జామ్‌ లాంటి వాటి కోసం కోచింగ్‌ తీసుకునే ఛాన్సే లేదు. కాబట్టి డాక్టర్‌ కావడం అనేది ఓ కలేనేమో అనుకున్నారు ఆ అమ్మాయిలు. వారి అదృష్టమో లేక వరమో గానీ నవోదయ పూర్వ విద్యార్థుల నెట్‌ వర్క్‌ అయిన టాటా AIG, మాజీ నవోదయ ఫౌండేషన్‌ మద్దతుతో వారు ఉంటున్న మారిహాన్‌ గ్రామంలోనే నీట్‌ కోచింగ్‌ 2024 చిన్నగా ప్రారంభమైంది. 

అది వారికి వరమైన ఆ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యిందుకు తోడ్పడింది. ఆ చిన్న ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఈ ఎగ్జామ్‌లో ఈ ముగ్గురు అమ్మాయిలు ఉత్తీర్ణులై తమ కలను సాకారం చేసుకున్నారు. ఆ స్వచ్ఛంధ సంస్థలో సుమారు 39 అడ్మిషన్‌ పోందగా వారిలో 25 మంది నీట్‌కి, మిగతా 14 మంది జేఈఈకి ప్రిపేరయ్యారు. 

అయితే ఆ నీట్‌ ఎగ్జామ్‌కి హాజరైన 25 మందిలో 12 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. దీన్ని మిగతా సర్వోదయ విద్యాలయాల్లో కూడా అందించి.. వెనుబడిన వర్గాల పిల్లలందరూ ఇలాంటి ఉన్నత చదవులు చదువుకుని తమ కలను సాకారం చేసుకునేలా చేయడమే తమ ధ్యేయం అని మారిహాన్‌ సాంఘిక సంక్షేమ డైరెక్టర్ కుమార్ ప్రశాంత్ అన్నారు.   

(చదవండి:  అమ్మాయిలూ.. బహుపరాక్‌!)

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)