Breaking News

నాన్న అంటే అంతేరా...! వైరల్‌ వీడియో

Published on Tue, 04/15/2025 - 16:18

టాలాంట్‌ చూపించడంలో మనోళ్ల  తర్వాతే ఎవరైనా.  ఎలాంటి దాన్నైనా వెరైటీగా వాడాలంటే కొంచెం బుర్ర వాడాలి. ఈ వాడకంలో మనోళ్లు మామూలోళ్లు కాదు. అసలేంటి ఇదంతా అనుకుంటున్నారా?  సరే. సూటిగా సుత్తిగా లేకుండా విషయంలోకి వెళ్లిపోదాం. తెలుగు రాపర్ రోల్ రిడా ఒక వీడియోను షేర్‌  చేశాడు. ఇదే ఇపుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. 

 ఇంతకీ ఈ వీడియోలో  ఏముందీ అంటే పిల్లలను వెనకి కూర్చోబెట్టుకుని ఝాం అంటూ వెళ్లి పోతున్నాడో డాడీ.  అయితే  ఏంటట అంటూ అప్పుడే ఫిక్స్‌ అయిపోవద్దు. ఇక్కడే ఉంది అసలు కత అంతా... సాధారణంగా సీటుపై కూర్చొంటే వింతేముంది. కోడి, ఇతర పక్షులను తీసుకెళ్లే ఒక బుట్ట ( పౌల్ట్రీ క్యారియర్) లాంటిది దాంట్లో వీల్ళద్దర్నీ కూర్చోబెట్టాడన్నమాట.  ఈ పౌల్ట్రీ క్యారియరే నెటిజన్లను  తెగ ఆకట్టుకుంటోంది. జస్ట్‌ కిడ్‌..డ్డింగ్‌ అనే క్యాప్షన్‌  కూడా దీనికి.  రోల్ రిడా "ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది" అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.  

ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బిగ్‌బాస్‌ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌ : ఫోటోలు వైరల్‌
ఈ వీడియో ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్‌ సంపాదించుకుంది.  దీనిపై నెటిజన్లు అనేక కమెంట్లు చేస్తున్నారు. "కోళ్ల సమాజం హర్ట్‌ భయ్యా"  అంటూ ఒకరు ఫన్నీగా కమెంట్‌ చేశారు. మరొకరు తండ్రి   క్రియేటివ్‌ ఆవిష్కరణను మెచ్చుకోగా,   "అమ్మ కంటే నాన్న ఎప్పుడూ  భిన్నంగా ఆలోచిస్తాడు" అని మరొకరు అన్నారు. బైక్ నంబర్ ప్లేట్ అది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బైక్‌గా భావిస్తున్నప్పటి, ఇది ఎక్కడిది అనేది ఖచ్చితమైన తెలియదు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)